News September 12, 2025

వంగూర్: బైక్‌పై నుంచి జారిపడి మహిళ మృతి

image

బైక్‌పై నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందిన ఘటన వంగూర్ మండలంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అచ్చంపేట(M) అక్కారం తాండాకు చెందిన బాలునాయక్ తన భార్య కళతో కలిసి కల్వకుర్తి నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వంగూర్ గేటు వద్ద బైక్‌పై నుంచి కళ ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News December 13, 2025

WGL: రెండో పోరు బరిలో 1,686 మంది అభ్యర్థులు

image

ఉమ్మడి WGL జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 1686 మంది సర్పంచ్ అభ్యర్థులు , 9884 మంది వార్డు సభ్యులు పోటీలో ఉన్నారు. రెండో విడతలో 564 జీపీలకు, 4937 వార్డులకు నోటిఫికేషన్ రాగా, వాటిలో 56 పంచాయతీలు, 917 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. హనుమకొండలో 248, వరంగల్ 354, జనగామలో 251, మహబూబాబాద్‌లో 460, భూపాలపల్లిలో 244, ములుగులో 129 మొత్తం 1686 మంది సర్పంచ్ అభ్యర్థుల భవిష్యత్ రేపటి ఆదివారం పోలింగ్‌లో తేలనుంది.

News December 13, 2025

భద్రాద్రి: ఓకే కుటుంబం నుంచి నలుగురు

image

పినపాక మండలంలోని సీతంపేట పంచాయతీ ఎన్నికల్లో మాజీ సర్పంచ్‌ పోతినేని శివశంకర్‌ 116 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా కీలక పాత్ర పోషించారు. శివశంకర్‌ తండ్రి ఇస్తారి, తల్లి జయమ్మ, పిన్ని సావిత్రమ్మలు వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఒకే కుటుంబం నుంచి నలుగురు విజయం సాధించి, పంచాయతీ పీఠాన్ని కైవసం చేసుకోవడం విశేషం.

News December 13, 2025

కంచిలి: రైలు ఢీకొని టెన్త్ విద్యార్థిని మృతి

image

కంచిలి మండలంలో గురువారం రాత్రి వందే భారత్ రైలు ఢీకొని పదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. పలాస జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కంచిలి పట్టణం బలియాపుట్టుగ కాలనీకి చెందిన సాలిన గంగోత్రిగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి నిర్ధారించుకున్నారు. దీనిపై కేసు నమోదైంది.