News November 8, 2025

వంటింటి చిట్కాలు

image

* ఉప్పు నిల్వ చేసే డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపర్ వేస్తే.. ఉప్పు తేమగా మారదు.
* అల్లం, వెల్లుల్లి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే.. కాగితంలో చుట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.
* కొత్త బంగాళదుంపలు ఉడికించేటప్పుడు నాలుగు పుదీనా ఆకులు వేస్తే మట్టి వాసన రాదు.
* కరివేపాకు పొడి చేసేటప్పుడు అందులో వేయించిన నువ్వుల పొడి వేస్తే మరింత రుచిగా ఉంటుంది.

Similar News

News January 16, 2026

ఎత్తుపడిన గొడ్డు పులికి జడుస్తుందా?

image

ముసలిదైపోయి, నీరసించి, ఇక చావుకు దగ్గరగా ఉన్న పశువు తన ముందుకు పులి వచ్చినా భయపడదు. ఎందుకంటే అది ఇప్పటికే చావు అంచుల్లో ఉంది, కాబట్టి కొత్తగా వచ్చే ప్రాణాపాయానికి అది ఆందోళన చెందదు. అలాగే జీవితంలో ఎన్నో దెబ్బలు తిని, కష్టాల చివరన ఉన్న వ్యక్తిని ఎవరైనా భయపెట్టాలని చూస్తే అతడు అస్సలు భయపడడు. “పోయేదేముంది?” అనే తెగింపు వచ్చినప్పుడు మనిషికి దేనికీ జంకడు అని చెప్పడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.

News January 16, 2026

యెమెన్ ప్రధాని సలేం బిన్ బ్రేక్ రాజీనామా

image

యెమెన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి సలేం బిన్ బ్రేక్ రాజీనామా చేయగా, విదేశాంగ మంత్రి షయా మొహ్సిన్ అల్ జిందానీ కొత్త PMగా నియామకం అయ్యారు. యెమెన్ పాలక ప్రెసిడెన్షియల్ లీడర్‌షిప్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. దక్షిణ యెమెన్‌లో నెలకొన్న ఉద్రిక్తతలు, దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధంతో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాల మధ్య ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.

News January 16, 2026

నేడు ఫిరాయింపు MLAల కేసు విచారణ

image

TG: నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల కేసును జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌ల ధర్మాసనం విచారించనుంది. 2023 ఎన్నికల్లో గెలిచిన 10 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి చేరినట్లు బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది. స్పీకర్ కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికే <<18864508>>నిర్ణయం<<>> తీసుకున్నారు. ఈ విషయాన్ని 3 నెలల్లో తేల్చాలంటూ గతంలో సుప్రీంకోర్టు స్పీకర్‌ను ఆదేశించింది.