News September 12, 2025
వట్లూరు రైల్వే ట్రాక్ మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతి

వట్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహాన్ని శుక్రవారం రైల్వే పోలీసులు గుర్తించారు. ఏలూరు వట్లూరు రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్ పక్కన కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహం దొరికింది. ఆరంజ్ రంగు షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించిన వ్యక్తి వయసు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. వివరాలు తెలిసినవారు రైల్వే HC ప్రసాద్‌ను సంప్రదించాలని సూచించారు.
Similar News
News December 9, 2025
పార్వతీపురం: ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ ఉక్కుపాదం

ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్ ప్రక్రియలో నిబంధనలు పాటించని మిల్లర్లపై జిల్లా యంత్రాంగం కఠిన వైఖరిని అవలంబించింది. ధాన్యం కొనుగోళ్లపై కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి పాల్గొన్నారు. అగ్నిమాపక భద్రతతో సహా కనీస వసతులు, భద్రతా ప్రమాణాలు పాటించని మిల్లర్లను వెంటనే బ్లాక్‌లిస్ట్ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

నరసరావుపేట ఏఆర్‌టీ కేంద్రానికి జాతీయ ఉత్తమ పురస్కారం

హెచ్‌ఐవీ/ఎయిడ్స్ బాధితులకు ఉత్తమ సేవలు అందించడంలో, లక్ష్యాలను 100% పూర్తి చేసినందుకు నరసరావుపేట ఏఆర్‌టీ (ART) కేంద్రానికి జాతీయ ఉత్తమ పురస్కారం లభించింది. ఈ పురస్కారాన్ని డాక్టర్ శారదకు జిల్లా వైద్యాధికారి రవి అందజేశారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం జిల్లాకు గర్వకారణమని ఆయన శుభాకాంక్షలు తెలిపారు.