News November 19, 2025

వడ్డేపల్లి: విద్యార్థిని మోకాళ్లపై నడిపించిన టీచర్

image

తాను అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వలేదని ఓ టీచరు 3వ క్లాస్ బాలుడిని మోకాళ్లపై నడిపించింది. ఈ ఘటన గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మం. జూలకల్లులో జరిగింది. కొంకలకు చెందిన టీజీ ఉదయ్ కుమార్(9) జూలకల్లు గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు. అడిగిన ప్రశ్నకు జవాబివ్వలేదని మంగళవారం మండే ఇసుకలో నడిపించడంతో గాయాలయ్యాయి. బుధవారం తండ్రి రంగన్న ఫిర్యాదుతో విచారణ చేపట్టినట్లు MEO నరసింహ తెలిపారు.

Similar News

News January 23, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 23, శుక్రవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.30 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.06 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.22 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 23, 2026

పిట్లం: గురువు ఉదారత.. అనాథ బాలుడికి విద్యాదాత!

image

తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన ఓ విద్యార్థికి నేనున్నానంటూ భరోసానిచ్చారు తిమ్మానగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నారాయణ. పిట్లం (M) తిమ్మానగర్ MPUPSలో బోండ్ల ప్రణయ్ 7వ తరగతి చదువుతున్నాడు. అతడి తండ్రి మూడేళ్ల క్రితం, తల్లి అంబవ్వ ఇటీవల క్యాన్సర్‌తో మరణించారు. అనాథగా మారి, దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రణయ్‌ను ఆయన ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లి, గురుకుల పాఠశాలలో సీటు, హాస్టల్ వసతి కల్పించారు.

News January 23, 2026

కడప: Way2News ఎఫెక్ట్ VRO సస్పెండ్

image

చెన్నూరు మండలం రామనపల్లి<<18926711>> VRO<<>> వేణుగోపాల్‌ను సస్పెండ్ చేస్తూ కడప కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న వేణు గోపాల్‌పై అందిన లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా VROను సస్పెండ్ చేస్తూ గురువారం కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు.