News February 15, 2025

వనపర్తి: ఆ ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తే చర్యలు: మానస

image

వ్యవసాయానికి వినియోగించాల్సిన ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని వనపర్తి జిల్లా రవాణా శాఖ అధికారిని మానస హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం పెబ్బేరు మండలంలో ఇసుక తరలిస్తున్న 7 ట్రాక్టర్లను ఆమె సీజ్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఇసుకను తరలించే ట్రాక్టర్లకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్, డ్రైవర్లకు లైసెన్సులు తప్పక ఉండాలన్నారు. అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవు అన్నారు.

Similar News

News March 16, 2026

HYD: ఆదివారం.. నెత్తురోడిన నగరం

image

నగరంలో వీకెండ్‌ రక్తపాతం జరిగింది. వరుస ప్రమాదాలు, దారుణ ఘటనలు కలకలం రేపాయి. మేడిపల్లిలో కారు ఢీకొనడంతో దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఒక్కగానొక్క కొడుకు అనాథయ్యాడు. ఉప్పల్‌లో కానిస్టేబుల్ సుధీర్‌ను దారుణంగా కత్తులతో హత్య చేశారు. శంషాబాద్‌లో వాహనం ఢీకొని విజయ్ (32) మృతి చెందాడు. గచ్చిబౌలిలో కర్ణాటక RTC బస్సు ఢీకొనడంతో బాలమ్మ (68) ప్రాణాలు కోల్పోయింది. ఒకే రోజు ఇన్ని దారుణాలు జరిగాయి.

News March 16, 2026

గ్యాస్ కొరత అంటూ అసత్య ప్రచారం.. వ్యక్తిపై కేసు: సీఐ

image

గ్యాస్ సిలిండర్ల కొరత అంటూ తప్పుడు సమాచారాన్ని వైరల్ చేసిన యూట్యూబర్‌ అమీర్ బాషాపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాలతో క్రైం నంబర్ 40/2026 U/S 353, 196, 356 BNS సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ జయనాయక్ తెలిపారు. ప్రజల్లో గందరగోళం, అశాంతి రేకెత్తించేలా అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

News March 16, 2026

10వ తరగతి పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌ మృతి

image

కర్నూలు జిల్లాలో పదో తరగతి పరీక్షల వేళ మొదటి రోజు విషాద ఘటన జరిగింది. కర్నూలులోని పరీక్ష కేంద్రం శ్రీ చైతన్య పాఠశాలకు చీఫ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్ అన్వర్ బాషా అకస్మాత్తుగా మృతి చెందారు. గ్యాస్ట్రిక్ సమస్యతో ఆయన అస్వస్థతకు గురవగా సిబ్బంది పరీక్ష కేంద్రం సమీపంలోని అమ్మ హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌లో మృతి చెందినట్లు డీఈవో కార్యాలయం ధ్రువీకరించింది.