News September 11, 2025
వనపర్తి ఎమ్మెల్యే ఫేక్ ఐడీతో సైబర్ నేరగాళ్ల మోసం

వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పేరుతో ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. మోసగాళ్లు ఎమ్మెల్యే మాట్లాడుతున్నట్లు మెసేజ్‌లు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తెలిపింది. ఈ అకౌంట్‌తో జాగ్రత్తగా ఉండాలని, ఎవరూ స్పందించవద్దని హెచ్చరించారు. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వెంటనే ఎమ్మెల్యేకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Similar News
News December 9, 2025
సంగారెడ్డి: ఈ తేదీల్లో పాఠశాలలకు సెలవు: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో జరుగనున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా విద్యా సంస్థలకు స్థానిక సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నందున 11, 14, 17 తేదీలలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థలకు స్థానిక సెలవు ఇవ్వాలని అన్నారు.
News December 9, 2025
తూ.గో: ఆరుగురు ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం అసంతృప్తి

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పచ్చజెండా రెపరెపలాడుతున్నా.. కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై CM చంద్రబాబు తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. వారి పనితీరుపై ఇంటిలిజెన్స్ నివేదికల ద్వారా సీఎం నిరంతరం సమాచారం సేకరిస్తున్నారని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా మార్కులు తగ్గిన 37 మంది ఎమ్మెల్యేల జాబితాలో ఆరుగురు ఉమ్మడి జిల్లా నుంచే ఉండటం చర్చనీయాంశంగా మారింది.
News December 9, 2025
తూ.గో: ఆ చేదు జ్ఞాపకానికి ఏడేళ్లు

2018 డిసెంబర్ 9న బంగాళాఖాతంలో ఏర్పడిన ‘పెథాయ్’ తుఫాను జిల్లా ప్రజలను అతలాకుతలం చేసింది. కాట్రేనికోన వద్ద తీరం దాటిన ఈ తుఫాను ధాటికి కోనసీమ వణికిపోయింది. ఈదురు గాలులకు దాదాపు 14 వేల హెక్టార్లలో వరి పంట నేలవాలగా, వేలాది ఎకరాల్లో కొబ్బరి, అరటి తోటలు ధ్వంసమయ్యాయి. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులకు అప్పట్లో కన్నీళ్లే మిగిలాయి.


