News August 14, 2025
వనపర్తి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

వర్షాల కారణంగా వనపర్తి జిల్లాలో ప్రజలకు కలిగే ఇబ్బందులను పరిష్కరించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం ఎస్పీ గిరిధర్‌తో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాలతో ఏవైనా విపత్కర పరిస్థితులు తలెత్తితే 08545- 220351, 233525 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
-SHARE IT
Similar News
News March 13, 2026
టీజేఏ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్‌గా సత్యనారాయణ

తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) కరీంనగర్ ఉమ్మడి జిల్లా కన్వీనర్‌గా రావుల సత్యనారాయణ నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్.గౌరీ నియామకపత్రం విడుదల చేశారు. సత్యనారాయణ నేటి నుంచే బాధ్యతలు చేపట్టనున్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు రమణారావు, అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఉప్పల లక్ష్మణ్ తదితర రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
News March 13, 2026
RTCలో సమ్మె: యాజమాన్యానికి JAC నోటీసు

TGRTC JAC.. యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేసింది. ప్రధానంగా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని, మహాలక్ష్మి పథకం కింద నెలకు ₹350 కోట్లు కోత లేకుండా నిధుల విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అలాగే ₹2,500 కోట్ల పాత బకాయిల చెల్లింపు, ఉద్యోగ భద్రత, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షల తొలగింపుతో పాటు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరింది.
News March 13, 2026
ఆసిఫాబాద్‌లో ఎల్పీజీ సిలిండర్ కొరత లేదు: కలెక్టర్

ఆసిఫాబాద్ జిల్లాలో గృహ అవసరాల LPG సిలిండర్ల కొరత లేదని కలెక్టర్ హరిత తెలిపారు. గ్యాస్ వినియోగదారులు భయపడవలసిన అవసరం లేదని, నిల్వలను ప్రత్యేక మానిటరింగ్ కమిటీ పర్యవేక్షిస్తోందన్నారు. కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని ఆమె హెచ్చరించారు.


