News February 10, 2025
వనపర్తి: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం: చిన్నారెడ్డి

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. హెల్త్ కార్డులపై త్వరలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులతో సమీక్ష చేస్తామన్నారు. ప్రజలు, జర్నలిస్టుల ఆరోగ్యం విషయంలో రాజీ పడేది లేదన్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచామని తెలిపారు. త్వరలో ఆరోగ్యశ్రీ అధికారులతో జర్నలిస్టుల విషయమై సమీక్ష చేసి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
Similar News
News February 16, 2026
ప్రపంచానికే పరిష్కారాలు చూపుతాం: మోదీ

ఢిల్లీ కేంద్రంగా నేటి నుంచి ఈ నెల 20 వరకు జరగనున్న ‘ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఆవిష్కర్తలు, పరిశోధకులు, ఔత్సాహికుల మధ్య ఉండటంవల్ల భారతీయ ప్రతిభ, ఏఐ సామర్థ్యం గురించి అవగాహన కలుగుతోంది. అందరం కలిసి మన దేశానికే కాకుండా అనేక సమస్యలపై ప్రపంచానికే పరిష్కారాలను చూపుతాం’ అని రాసుకొచ్చారు.
News February 16, 2026
రోకో.. స్టైల్ అదుర్స్

టీమ్ ఇండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వయసు పెరుగుతున్నా యంగ్‌గా కనిపిస్తున్నారని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఈ 38, 37 ఏళ్ల స్టార్ ప్లేయర్ల లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. రోహిత్ శర్మ బరువు తగ్గి, ఫిట్‌గా, స్టైలిష్‌గా మారిపోయారు. అటు ఇండియాకు వచ్చిన విరాట్ తనదైన స్వాగ్‌తో అదుర్స్ అనిపించారు.
News February 16, 2026
ఫేక్ లింకులపై క్లిక్ చేయొద్దు: బాపట్ల ఎస్పీ

ఫేక్ లింకుల ద్వారా సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ ఉమామహేశ్వర్ హెచ్చరించారు. క్రికెట్ లైవ్ స్ట్రీమింగ్, బ్యాంక్ KYC అప్‌డేట్, తక్కువ వడ్డీ రుణాల పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సూచించారు. OTPలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. మోసానికి గురైనట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేయాలన్నారు.


