News May 7, 2025

వనపర్తి: జాతీయ జెండా విషయంలో అధికారుల వివరణ 

image

పోప్ ఫ్రాన్సిస్ మరణించిన నేపథ్యంలో వారి గౌరవార్థం భారతదేశంలో 3రోజుల పాటు జాతీయ పతాకం సగం వరకు దింపి ఉంచేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అందుకు అనుగుణంగా వనపర్తి కలెక్టరేట్‌లో జాతీయ జెండాను సగం వరకు దించామని అధికారులు తెలిపారు. విషయం తెలియని కొంతమంది విలేకరులు జాతీయ జెండాకు అవమానం అని ఫొటోలు పెట్టి వార్త రాయడం సరైన పద్ధతి కాదని,వ్యతిరేక వార్త రాసే ముందు సంబంధిత అధికారిని వివరణ అడగాలన్నారు.

Similar News

News February 7, 2026

ఆత్మకూరు: బిడ్డకు స్నానం చేయిస్తూ.. ఓట్లు అడుగుతూ..

image

మున్సిపల్ ఎన్నికల వేళ ఆత్మకూరు 4వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పుల్లరి మంజుల వినూత్నంగా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. శనివారం వార్డులో పర్యటిస్తూ.. ఓ ఓటరు బిడ్డకు స్వయంగా స్నానం చేయించారు. ప్రజలు చేసే నిత్యవార్యాల్లో భాగస్వామ్యం అవుతూ, చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థి చేస్తున్న ఈ ప్రయత్నం పట్టణంలో చర్చనీయాంశమైంది. నాయకులు అశోక్, అనిల్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.

News February 7, 2026

నల్గొండ: మున్సిపోల్స్‌లో ‘నోట్ల’ వర్షం

image

NLG కార్పొరేషన్, 17 మున్సిపాలిటీల్లో ఎన్నికల ఖర్చు చుక్కలను తాకుతోంది. 427 వార్డుల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు కోట్లు కుమ్మరిస్తున్నారు. ఒక్కో వార్డులో సగటున రూ.40 నుంచి 50 లక్షల వరకు వ్యయం చేస్తున్నట్లు అంచనా. ఓటర్లకు తాయిలాలు, మద్యం, క్యాంపు రాజకీయాలు అన్నీ కలిపి జిల్లావ్యాప్తంగా ఈ ఖర్చు రూ.200 కోట్లు దాటవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

News February 7, 2026

RCB విజయం.. మంధాన తల్లి పోస్ట్ వైరల్‌

image

WPL ఫైనల్లో <<19062605>>RCB ఘన విజయం<<>> సాధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సోషల్ మీడియాలో స్మృతి మంధాన తల్లి స్మితకు సంబంధించిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. స్మృతి బ్యాటింగ్ చేసేటప్పుడు ఢిల్లీ బౌలర్లలో ఆమె తన మాజీ ప్రియుడు పలాశ్ ముచ్చల్‌ను ఊహించుకున్నారనే మీమ్‌ను ఇన్‌స్టాలో రీపోస్ట్ చేశారు. దీనిపై ‘సూపర్ ఆంటీ’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. స్క్రీన్‌షాట్లు వైరల్ కావడంతో కాసేపటికే ఆమె ఆ పోస్టును తొలగించారు.