News May 7, 2025
వనపర్తి జిల్లాలో కొనసాగుతున్న ఎండ తీవ్రత

వనపర్తి జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. శుక్రవారం అత్యధికంగా పానగల్‌లో 42.3℃ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా శ్రీరంగాపూర్, చిన్నంబావి 42.1, ఆత్మకూర్ 41.9, పబ్బేర్, పెద్దమందడి, కొత్తకోట 41.8, కనైపల్లి 41.7, అమరచింత 41.6, వనపర్తి 41.5, మదనాపూర్ 41.3, రేమద్దుల 41, గోపాలపేట 40.9, జానంపేట 40.6, ఘన్‌పూర్ 40.3, వీపనగండ్ల 40.0, కేతేపల్లి, రేవల్లిలో 39.9℃ ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News February 13, 2026
పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు: సీపీ

వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఐదు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపునకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ బందోబస్తు నిర్వహించాలని సిపి సన్‌ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించవద్దని, కేవలం అనుమతి పత్రాలు ఉన్నవారినే క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపాలని స్పష్టం చేశారు.
News February 13, 2026
బంగ్లాలో BNP విజయం.. మనకెలా లాభం అంటే?

బంగ్లాదేశ్‌లో <<19125261>>BNP<<>> గెలవడం భారత్‌కు కొద్దిగా సానుకూల అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో ప్రధాన పార్టీ ‘జమాతే ఇస్లాం’ పూర్తిగా పాకిస్థాన్‌కు తొత్తు అని, అది గెలిచి ఉంటే సమస్యలు వచ్చి ఉండేవని చెబుతున్నారు. బంగ్లాలో హిందువులపై దాడి వెనుక జమాతేనే కీలక సూత్రధారి అనే ఆరోపణలు ఉన్నాయి. అటు BNP అధినేత తారిఖ్ విద్యావంతుడు కావడంతో పాటు ఏ దేశంలో జోక్యం చేసుకోమని ఇప్పటికే స్పష్టం చేశారు.
News February 13, 2026
సంగారెడ్డి: మైనర్ బాలికపై రేప్.. 20 ఏళ్ల శిక్ష

సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలానికి చెందిన వడ్డే రాజు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో సంగారెడ్డి స్పెషల్ పొక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నేరం నిరూపితం కావడంతో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ జడ్జి కె.జయంతి తీర్పు చెప్పారు. నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులను ఎస్పీ పారితోష్ పంకజ్ ప్రత్యేకంగా అభినందించారు.


