News August 11, 2025
వనపర్తి జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లు: కలెక్టర్

ఆగస్టు 15న జిల్లాలో నిర్వహించబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాట్లపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో నిర్వహించబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
Similar News
News March 14, 2026
NRPT: జిల్లాలో సిలిండర్ల కొరత లేదు: అదనపు కలెక్టర్

జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, గృహావసరాలకు విద్యాలయాలకు, ఆసుపత్రులకు సిలిండర్ల సరఫరాలో లోటు రానివ్వమని అదనపు కలెక్టర్ ఫణీందర్ రెడ్డి అన్నారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్‌లో గ్యాస్ డీలర్లు సెల్స్ మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. సిలిండర్ల సరఫరాకు సంబంధించిన వివరాలను ప్రతి రోజు అందించాలని చెప్పారు. యుద్ధం నేపథ్యంలో సిలిండర్ల కొరత ఉన్నట్లు వస్తున్న వార్తలను నమ్మకండని సూచించారు.
News March 14, 2026
తిరుపతి: కళ్లలో కారం కొట్టి బంగారం దోపిడి

సూళ్లూరుపేట కచేరి వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర గోల్డ్ షాపులో శనివారం మధ్యాహ్నం దోపిడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాల మేరకు.. కొనుగోలు చేస్తున్నట్లు నటించిన ఓ దుండగుడు షాపు యజమాని కళ్లలో కారం పొడి చల్లి సుమారు ₹30 లక్షల విలువైన 916 హాల్‌మార్క్ బంగారు నగలను అపహరించుకుని పరారయ్యాడు. ఘటనతో ప్రాంతంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 14, 2026
NLG జిల్లావ్యాప్తంగా 37 మంది గైర్హాజరు

జిల్లా వ్యాప్తంగా 106 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి తెలుగు పరీక్ష సుజావుగా జరిగినట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. 19,672 మంది విద్యార్థులకు గాను, 19,635 మంది విద్యార్థులు హాజరై 37 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. వీరిలో ముగ్గురు ప్రైవేటు విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. కలెక్టర్ బి. చంద్రశేఖర్ నాలుగు సెంటర్లను తనిఖీ చేశారని చెప్పారు.


