News November 19, 2025
వనపర్తి జిల్లాలో TODAY…టాప్ NEWS

* శ్రీరంగపురం: రంగసముద్రం రిజర్వాయరులో భారీ కొండచిలువ పట్టివేత
* వనపర్తి: జిల్లా కేంద్రంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
* పానగల్: ధాన్యం తేమశాతం గుర్తింపుపై ఐకెపి సిబ్బందికి శిక్షణ
* ఆత్మకూరులో పని చేయని ఏటీఎం మిషన్లు: వినియోగదారులు
* అమరచింత: కాలిపోయిన పత్తి… నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: సీపీఎం
* బోరుకు కుళాయి ఏర్పాటు చేయండి
Similar News
News January 18, 2026
తూ.గో: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కొవ్వూరు మండలం దేచర్ల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మట్ట సత్యనారాయణ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. పంగిడి నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సత్యనారాయణతో పాటు ఉన్న కోటి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడు క్రషర్ కార్మికుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. సత్యనారాయణకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 18, 2026
కొల్లూరు: సైన్స్ ఫెయిర్‌కు 210 మంది

కొల్లూరులో ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ తెలిపారు. పాఠశాలలో ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. ఆరు రాష్ట్రాల నుంచి 210 విద్యార్థులు తమ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తారని చెప్పారు. సైన్స్ ఫెయిర్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
News January 18, 2026
తెర్పోల్ చెరువులో దూకి వ్యక్తి మృతి

కొండాపూర్‌కు చెందిన దొబ్బల రాజు గత నెల 31వ తేదీన గ్రామ శివారులోని దర్గాకు వెళ్లి తిరిగి రాలేదు. వెతికిన ఆచూకీ లభించకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆదివారం మధ్యాహ్నం తెర్పోల్ శివారులో చెరువులో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


