News January 27, 2025
వనపర్తి: దివ్యాంగుల ఇండియా క్రికెట్ జట్టుకు ఎంపిక

వనపర్తి జిల్లా గోపాల్‌పేట గ్రామానికి చెందిన ప్రభాకర్ దివ్యాంగుల ఇండియా క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. ఫిబ్రవరి 14 నుంచి నేపాల్‌లో జరిగే టీ20, వన్డే మ్యాచ్‌లలో ఆడనున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ఇలాంటి టోర్నమెంట్లకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందితే, దేశం తరఫున ఇంకా మంచి ప్రదర్శనలు చేయటానికి వీలుంటుందని ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 16, 2025
కోళ్లు చనిపోతే ఈ నంబర్‌కు కాల్ చేయండి!

TG: ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న వేళ యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మం. నేలపట్లలో వెయ్యి బ్రాయిలర్ కోళ్లు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వైద్యులు కోళ్ల నమూనాలు సేకరించి HYDలోని వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ల్యాబుకు పంపారు. 3 రోజుల్లో ల్యాబ్ రిపోర్ట్ రానుందని, అప్పటివరకు కోళ్లు అమ్మవద్దని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో ఎక్కడైనా కోళ్లు చనిపోతే 9100797300కు కాల్ చేయాలని ప్రభుత్వం సూచించింది.
News February 16, 2025
అనకాపల్లి: పెద్దలు వార్నింగ్.. యువకుడు ఆత్మహత్య

రోలుగుంట మండలం వడ్డిప గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమ వ్యవహారంలో పెద్దలు హెచ్చరించడంలో ఉరి వేసుకుని శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. వైదాసు సందీప్ (20) కోటవురట్ల మండలానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. యువతి తల్లిదండ్రులు పంచాయతీ పెట్టి పెద్దలతో వార్నింగ్ ఇచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు తన ఇంటిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 16, 2025
రాజమండ్రి: జనసేన పార్టీ సన్నాహక సమావేశం

ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం కోసం జనసేన సన్నాహక సమావేశం ఆదివారం 03.00 గంటలకు రాజమండ్రి చెరుకూరి గార్డెన్స్‌లో జరుగుతుంది. ఈ సమావేశానికి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్‌లు పాల్గొని దిశానిర్దేశం చేస్తారన్నారు. జనసేన పార్టీ నగర అధ్యక్షుడు వై.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.