News March 5, 2025
వనపర్తి: పరీక్ష రాసిన 6,476 మంది ఇంటర్ విద్యార్థులు

తొలిరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని వనపర్తి డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. బుధవారం జరిగిన పరీక్షకు 6,714 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 6,476 మంది హాజరయ్యారు. 238 మంది విద్యార్థులు హాజరుకాలేదు. ఇంటర్ బోర్డు నుంచి వచ్చిన అధికారులు వనపర్తిలోని వివిధ పరీక్ష కేంద్రాలను సందర్శించారు.
Similar News
News December 10, 2025
పురుగు మందులు.. రైతులకు సూచనలు

ఒకే మందు పొడి మందుగా, నీటిలో కరిగే ద్రావణంగా, గుళికల రూపంలో లభ్యమౌతుంటే.. ఆశించిన తెగులు, పంట దశ, నీటి లభ్యత, సమస్య తీవ్రతను బట్టి ఎంచుకోవాలి. పొడి మందులు గాలికి ఎగిరిపోయి వాతావరణ కాలుష్యం కలిగించవచ్చు. నీటిలో కరిగే పొడిమందులను సరిగా కలపకపోతే స్ప్రేయర్‌ల నాజిల్స్‌లో చేరి సరిగా పనిచేయవు. నాసిరకం మందులు కలుపుతున్నప్పుడు చర్మం నుంచి శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అందుకే వీటిని జాగ్రత్తగా వాడాలి.
News December 10, 2025
అలా చేస్తే కేసులు నమోదు చేస్తాం: తిరుపతి SP

తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు ఇప్పిస్తామని జీప్ డ్రైవర్లు, దళారులు భక్తులను మోసగిస్తే కేసులు నమోదు చేస్తామని తిరుపతి SP సుబ్బరాయుడు హెచ్చరించారు. వైకుంఠ ఏకాదశి దర్శన ఏర్పాట్లపై TTD అధికారులతో ఆయన సమీక్ష చేశారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, శ్రీనివాసం, అలిపిరి, లగేజ్ కౌంటర్ వంటి ముఖ్య ప్రదేశాల్లో భక్తులకు నిరంతర అవగాహన కల్పించాలని సూచించారు. రెగ్యులర్‌గా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ఉంటాయన్నారు.
News December 10, 2025
మొదలైన లారీల బంద్

TGలో లారీల టెస్టింగ్, ఫిట్‌నెస్ ఛార్జీలు తగ్గించాలని సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బంద్ పాటిస్తున్నామని తెలిపింది. 13ఏళ్లు దాటిన వాహనాలకు ఫిట్‌నెస్, టెస్టింగ్ కోసం రూ.12 వేలు వసూలు చేసేవారని, తాజాగా రూ.30వేలకు పెంచారని మండిపడ్డారు. అటు APలో లారీ ఓనర్ అసోసియేషన్‌తో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో అక్కడ బంద్ తాత్కాలికంగా వాయిదా పడింది.


