News November 20, 2025
వనపర్తి: ప్రజలకు పారదర్శక సేవలు అందించాలి- డీజీపీ

ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లాలో నేరాల నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలు,పెండింగులో ఉన్న కేసుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పెరిగిపోతున్న వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News January 20, 2026
ఏ బాటిల్‌లో నీటిని నిల్వ చేస్తున్నారు?

తాగే నీటిని నిల్వ చేసే సీసా కూడా రుచిని ప్రభావితం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. రాగి సీసాలో 16 గంటల పాటు నీటిని నిల్వ ఉంచి తాగితే శరీరానికి మేలు చేస్తుంది. అయితే వీటిలో నిమ్మరసం వంటివి నిల్వ చేయకూడదు. గాజు సీసా నిల్వకు ఉత్తమం. ఇందులో ఎలాంటి రసాయనచర్యలు ఉండవు. తేలికగా ఉంటాయని వాడే ప్లాస్టిక్ బాటిల్స్ ఆరోగ్యానికి ప్రమాదకరం. ముఖ్యంగా పాతబడ్డవి వాడకపోవడం మేలు.
News January 20, 2026
మామిడిలో ఆకుతినే పురుగు నివారణకు సూచనలు

మామిడిని ఆకుతినే పురుగు ఆశించి పంటకు నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు అజాడిరక్టిన్(3000 పి.పి.ఎం.) 300 మి.లీ.లతోపాటు ఎసిఫేట్ 75% ఎస్.పి. 150 గ్రా. లేదా క్వినాల్‌ఫాస్ 25% ఇ.సి. 200ml లేదా ప్రొఫెనోఫోస్ 50% ఇ.సి. 200ml లలో ఏదైనా ఒక దానిని 100 లీటర్ల నీటికి కలిపి చెట్టు పూర్తిగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. అలాగే మామిడి తోటలో కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి.
News January 20, 2026
మేడారంలో మిస్సింగ్ పర్సన్ ట్రాకింగ్ సిస్టం!

మేడారం మహా జాతరలో భక్తుల భద్రత కోసం ప్రభుత్వం ‘మేడారం 2.0’ కాన్సెప్ట్‌ను తీసుకువచ్చింది. AI ఆధారిత ‘టీజీ-క్విస్ట్’ డ్రోన్లు, హీలియం బెలూన్లకు అమర్చిన హై-రిజల్యూషన్ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచనున్నారు. తప్పిపోయిన వారిని త్వరగా గుర్తించేందుకు వోడాఫోన్-ఐడియా సహకారంతో ప్రత్యేక ట్రాకింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇకపై జాతరలో భక్తులు తప్పిపోతారనే భయం ఉండదని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


