News February 18, 2025
వనపర్తి: బాలిక ఆత్మహత్యాయత్నం

ఖిల్లాఘనపూర్ మండలంలోని ఓ తండాకు చెందిన బాలిక(15) తాను చదువుతున్న కేజీబీవీ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సిబ్బంది తెలిపిన వివరాలిలా.. బాలిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. సోమవారం ప్రార్థన సమయంలో బాలిక హాజరుకాకపోవటాన్ని సిబ్బంది గమనించారు. తరగతి గదిలో బాలిక జ్వర మాత్రలు మింగి ఉండటాన్ని చూసి ఇన్‌ఛార్జ్ ఎస్ఓ ప్రశాంతికి సమాచారం అందించారు. వెంటనే వీపనగండ్లలోని ఆసుపత్రికి తరలించారు.
Similar News
News March 13, 2026
భద్రాచలం: శ్రీరామ నవమి.. 400కు పైగా SPL. బస్సులు

భద్రాచలం శ్రీరామ నవమి వేడుకలకు TGSRTC, APSRTCలు భారీ ఏర్పాట్లు చేశాయి. ఖమ్మం రీజియన్ నుంచి 234, ఏపీ నుంచి 172 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం సరిరామ్ తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా విజయవాడ, హైదరాబాద్‌లకు అదనపు సర్వీసులను కేటాయించారు. భద్రాచలం జూనియర్ కళాశాల నుంచి ఆలయం వరకు భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నారు.
News March 13, 2026
వరంగల్: రే‘వూరి’లో ఆమె రాక ఇబ్బంది!

కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. వరంగల్ జిల్లాలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని గీసుకొండలో కలెక్టర్ సత్యశారద ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి వస్తారనే ఉద్దేశ్యంతో MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి గీసుకొండలో ప్లాన్ చేశారు. మంత్రి పర్యటన రద్దవడంతో ముఖ్య అతిథిగా మంత్రి సురేఖ హజరయ్యారు. దీంతో MLAలు రేవూరి, KR నాగరాజులు డుమ్మా కొట్టారు.
News March 13, 2026
NLG: ఒక్కో పంటపై రూ.2వేల పెంపు..!

రాబోయే సాగు సీజన్‌కు సిద్ధమవుతున్న జిల్లా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ పంటల రుణ పరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాదితో పోల్చితే ఒక్కో పంటపై అదనంగా రూ.2,000లు పెంచుతూ బ్యాంకర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నల్లగొండ జిల్లాలోని సుమారు 5,65,803 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.


