News November 7, 2025
వనపర్తి: ‘బీజీలు సమర్పించిన మిల్లులకే ధాన్యం కేటాయింపు’

ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి బ్యాంకు గ్యారంటీలు (బీజీ) సమర్పించిన రైస్ మిల్లులకే ధాన్యం కేటాయించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మిల్లర్లతో ఆయన సమావేశమయ్యారు. అర్హత సాధించిన 80 మిల్లుల్లో కేవలం 18 మిల్లులు మాత్రమే బీజీలు సమర్పించాయని, మిగతా అర్హతగల మిల్లులన్నీ వెంటనే బీజీలు సమర్పించాలని ఆదేశించారు.
Similar News
News January 24, 2026
VJA: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. బాలుడి ఇంటికి వెళ్లిన బాలిక

సోషల్ మీడియా పరిచయాలు యువతను పెడదారి పట్టిస్తున్నాయి. ప్రసాదంపాడుకు చెందిన ఓ బాలికను ఈ నెల 21న తల్లి మందలించడంతో, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన పామర్రుకు చెందిన బాలుడి ఇంటికి వెళ్లిపోయింది. అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నానని చెప్పి నేరుగా బాలుడి వద్దకు వెళ్లడంతో అతని కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. బాధ్యతగా వ్యవహరించిన బాలుడి కుటుంబీకులు వెంటనే బాలికను పటమట పోలీసులకు అప్పగించారు.
News January 24, 2026
బిడ్డను నరబలి ఇచ్చిన తల్లికి ఉరిశిక్ష రద్దు!

TG: 2021లో సూర్యాపేట జిల్లాలో మూఢనమ్మకంతో 7 నెలల పసికందును నరబలి ఇచ్చిన కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితురాలు బానోత్ భారతికి దిగువ కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేసింది. ఘటన సమయంలో భారతి తీవ్రమైన మానసిక అనారోగ్యంతో ఉందని, ఏం చేస్తుందో కూడా తెలియని స్థితిలో ఉన్నందున నేరం వర్తించదని స్పష్టం చేసింది. ఆమెను తక్షణమే మానసిక చికిత్స కేంద్రానికి తరలించాలని ఆదేశించింది.
News January 24, 2026
నిర్మల్: డీలర్ వద్దే వాహన రిజిస్ట్రేషన్

వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పు తెచ్చింది. శనివారం (జనవరి 24) నుంచి కొనుగోలు చేసే వాహనాలకు డీలర్ పాయింట్ వద్దే రిజిస్ట్రేషన్ జరుగుతుందని రవాణా శాఖ అధికారులు దుర్గాప్రసాద్, మహేందర్ తెలిపారు. వాహనదారులు ఇకపై ఆర్టీఓ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, షోరూమ్‌లోనే ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు. దీనివల్ల సమయం, శ్రమ ఆదా అవుతుందన్నారు.


