News April 23, 2025

వనపర్తి: భూభారతి చట్టంపై అవగాహన కల్పించండి: మంత్రి 

image

భూ భారతి చట్టం-2025పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. మంగళవారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి చట్టంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. రూ.5 లక్షల లోపు ఇల్లు నిర్మాణం ఏవిధంగా అవుతుందో లబ్ధిదారులకు మోడల్ ఇళ్లు చూపించాలని అన్నారు. గడువులోపు ఎల్ఆర్ఎస్ పూర్తి క్రమబద్ధీకరణ అయ్యేవిధంగా చూడాలన్నారు.

Similar News

News March 13, 2026

ధైర్యంగా పరీక్షలు రాయండి: కలెక్టర్ రాహుల్ శర్మ

image

శనివారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు కలెక్టర్ రాహుల్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలను ఎదుర్కోవాలని సూచించారు. సరైన ప్రణాళిక, సమయపాలన పాటించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. చదువుపై పూర్తి నమ్మకంతో ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, ఇది విద్యార్థుల జీవితంలో కీలక ఘట్టమని కలెక్టర్ గుర్తుచేశారు.

News March 13, 2026

జిల్లాలో ఎక్కడా గ్యాస్ కొరత లేదు: నిర్మల్ కలెక్టర్

image

జిల్లాలో ఎక్కడా గ్యాస్ సిలిండర్ల కొరత లేదని కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. జిల్లా ప్రజల అవసరాలకు సరిపడినన్ని గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, సరఫరా వ్యవస్థను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రజల గృహ అవసరాల కోసం అవసరమైన మేరకు గ్యాస్ సిలిండర్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్యాస్ సిలిండర్ల కొరతపై వస్తున్న అసత్య వార్తలను నమ్మవద్దని సూచించారు.

News March 13, 2026

తూ.గో జిల్లాలో నిరంతరాయంగా LPG సరఫరా

image

ఏపీ ప్రభుత్వం గృహ అవసరాలు & అత్యవసర సేవలకు నిరంతరాయంగా LPG సరఫరా జరిగేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన IOCL, HPCL, BPCL సంస్థలతో పాటు LPG పంపిణీదారులతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నదనీ జిల్లా పౌర సరఫరాల అధికారి వి.పార్వతి శుక్రవారం తెలిపారు. జిల్లాలో ఉన్న 52 ఎల్పీజీ గ్యాస్ పంపిణీదారుల ద్వారా సుమారు 8.67 లక్షల గ్యాస్, కనెక్షన్ దారులకు గ్యాస్ సరఫరా జరుగుతోందన్నారు.