News December 1, 2025

వనపర్తి: రెండోరోజు 399 వార్డు మెంబర్ల నామినేషన్లు దాఖలు

image

వనపర్తి జిల్లాలో రెండో విడతలో జరగనున్న 94 గ్రామ పంచాయతీల్లోని 850 వార్డులకు ఈరోజు మొత్తం 399 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మండలాల వారీగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
✓ ఆత్మకూర్ మండలం – 47
✓ అమరచింత మండలం – 52
✓ కొత్తకోట మండలం – 130
✓ మదనాపూర్ మండలం – 43
✓ వనపర్తి మండలం – 127 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా ఇప్పటివరకు మొత్తం వార్డు సభ్యుల నామినేషన్ల సంఖ్య 454కు చేరింది.

Similar News

News February 13, 2026

NZB: బీజేపీ మేయర్ అభ్యర్థి స్రవంతి రెడ్డి విజయం

image

నిజామాబాద్ నగరంలోని ఆరో డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డి విజయం సాధించారు. కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన గోపిడి స్రవంతి రెడ్డి బీజేపీ మేయర్ అభ్యర్థిగా ఆరో డివిజన్ నుంచి పోటీ చేశారు. ప్రత్యర్థిపై మెజారిటీతో గెలుపొందారు. తనకు ఓటు వేసి గెలిపించిన వార్డు సభ్యులకు స్రవంతి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

News February 13, 2026

VZM: ‘ఆ సర్టిఫికేట్ అందించకపోతే పెన్షన్ కట్’

image

రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్, కుటుంబ పెన్షన్ దారులు తమ పెన్షన్ నిరంతరాయంగా పొందేందుకు నిర్ణీత గడువులోగా లైఫ్ సర్టిఫికేట్ అందించాలని జిల్లా ట్రైజరీ అధికారి వి.నాగ మహేశ్ శుక్రవారం తెలిపారు. ఈ 28వ తేదీలోపు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను ఇవ్వల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ విధానంలో Jeevan Pramaan యాప్ ద్వారా ఇంటి నుంచే జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించవచ్చునని పేర్కొన్నారు.

News February 13, 2026

పార్వతీపురం: విద్యాసంస్థల్లో మరమ్మతు పనులు వేగవంతం చేయాలి

image

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల సివిల్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఐటీడీఏ ఇన్‌ఛార్జ్ ప్రాజెక్ట్ అధికారి సి.యశ్వంత్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లోని మరుగుదొడ్లు వంద శాతం పనితీరులో ఉండాలని, నీటి సౌకర్యం, శానిటేషన్ పనులపై ఏఈఈలు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.