News November 7, 2025
వనపర్తి: రేపు కలెక్టరేట్‌లో సామూహిక వందేమాతరం గేయాలాపన

వనపర్తి కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీ ప్రాంగణంలో శుక్రవారం సామూహిక వందేమాతరం గేయాలాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బంకించంద్ర ఛటర్జీ వందేమాతరం గేయం రచించి 150 సం.లు పూర్తి అయిన సందర్భంగా ప్రతిఒక్కరూ గేయాలాపన చేయాలని సూచించారు. అలాగే జిల్లాలోని అన్ని విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో వందేమాతరం గేయాలాపన చేసేందుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News January 17, 2026
కాకినాడలో పవన్ ‘న్యూ లుక్’

జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సరికొత్త వేషధారణతో అభిమానులను మంత్రముగ్ధులను చేశారు. ఈనెల 9న పిఠాపురం, కాకినాడ పర్యటనలో ప్యాంటు, స్వెటర్ ధరించి సాదాసీదాగా కనిపించిన ఆయన, శనివారం గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి మాత్రం పూర్తి ‘స్మార్ట్’ లుక్‌లో విచ్చేశారు. గడ్డం ట్రిమ్ చేసుకొని, సంప్రదాయ కుర్తా పైజామాలో మెరిసిపోతున్న పవన్‌ను చూసి అభిమానులు జేజేలు పలికారు.
News January 17, 2026
విధుల్లో చేరిన మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు

మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పులి శ్రీనివాసులు శనివారం ఉదయం విధుల్లో చేరారు. ఇవాళ తన కార్యాలయంలో బాధ్యతలను చేపట్టారు. అద్దంకి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, గ్రూప్-2 పరీక్షలో ఉత్తీర్ణులై 2009లో అద్దంకి ఎమ్మార్వోగా పనిచేసిన పులి శ్రీనివాసరావు పని చేశారు. ఇటీవల నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు.
News January 17, 2026
తిరుపతి: ఈ రెండు పరీక్షలు తప్పక రాయాల్సిందే..!

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థులు 2 పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈనెల 21న నైతికత, మానవీయ విలువలు, 23న పర్యావరణ పరిరక్షణ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు ఉత్తీర్ణత కాకపోతే.. పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులు అయినా కూడా మార్కులు కనిపించవని అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 30,318 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయాల్సి ఉంది. ఈ పరీక్షలకు తప్పనిసరిగా హాజరయ్యేలా తల్లిదండ్రులు చొరవచూపాలి.


