News November 8, 2025

వనపర్తి: రేపు న్యాయ సేవాధికార దినోత్సవం.. ర్యాలీ, సదస్సు

image

న్యాయ సేవాధికార దినోత్సవం సందర్భంగా ఆదివారం అవగాహన ర్యాలీ, సదస్సును నిర్వహిస్తున్నట్లు వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని తెలిపారు. ఉదయం 10 గంటలకు జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి ర్యాలీ ప్రారంభమై, బస్టాండ్ కూడలి మీదుగా తిరిగి కోర్టుకు చేరుకుంటుంది. అనంతరం కోర్టు ఆవరణలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని ఆమె కోరారు.

Similar News

News January 14, 2026

ఏలూరులో సంక్రాంతి వేడుకల్లో ఎడ్ల బండిపై ఎస్పీ దంపతులు

image

ఏలూరులో పోలీసు ప్రధాన కార్యాలయ ఆవరణలో సంక్రాంతి సంబరాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ ప్రతాప శివ కిషోర్, ఆయన సతీమణి ధాత్రి రెడ్డి (రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో) దంపతులు సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేసి, చిన్నారులకు భోగి పళ్లు పోశారు. అనంతరం పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఎడ్లబండిపై విహరించి అందరినీ అలరించారు. ఈ వేడుకల్లో పోలీసు కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి.

News January 14, 2026

గిల్ మినహా టాపార్డర్ విఫలం

image

న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో భారత టాపార్డర్ విఫలమైంది. కెప్టెన్ గిల్(56) మినహా రోహిత్(24), కోహ్లీ(23), అయ్యర్(8) నిరాశపర్చారు. ఓపెనింగ్ జోడీ తొలి వికెట్‌కు 70 పరుగులు నమోదు చేసింది. 99 రన్స్ వద్ద రెండో వికెట్ కోల్పోగా 19 పరుగుల వ్యవధిలోనే 3 కీలక వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. NZ బౌలర్ క్లర్క్ 3 వికెట్లతో చెలరేగారు. 26 ఓవర్లో భారత్ స్కోరు 125-4.

News January 14, 2026

మాకవరపాలెం: సంక్రాంతికి అత్తవారింటికి వస్తుండగా ప్రమాదం.. వ్యక్తి మృతి

image

మాకవరపాలెం(M) పైడిపాలెం సెంటర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై దామోదర్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. తూ.గో జిల్లాకు చెందిన కీర్తి రాంబాబు(32) బుధవారం సంక్రాంతి పండుగకు మాకవరపాలెం(M) తామరంలోని అత్తవారింటికి బైకుపై వస్తున్నాడు. పైడిపాల సెంటర్ వద్ద ఎదురుగా వస్తున్న ఆటో బైక్‌ను ఢీకొట్టింది. రాంబాబు తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతనికి వివాహమై ఏడాదవుతోంది.