News September 10, 2025

వనపర్తి: ‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

image

జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్.సునీత అన్నారు. ఈ నెల 13న వనపర్తి జిల్లా కోర్టులలో జరగనున్న లోక్ అదాలత్‌లో రాజీకి అవకాశం ఉన్న సివిల్, క్రిమినల్ కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని ఆమె తెలిపారు. చిన్న కేసుల కోసం కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ డబ్బు, సమయం వృథా చేసుకోవద్దని సూచించారు.

Similar News

News December 10, 2025

అనకాపల్లి: మాటామంతీలో పాల్గొన్న జిల్లా ఎంపీడీవోలు

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో బుధవారం నిర్వహించిన మాటామంతీ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు ఎంపీడీవోలు ఉమ్మడి విశాఖ జిల్లా సీఈవో నారాయణమూర్తి ఆధ్వర్యంలో పాల్గొన్నారు. ఉద్యోగులు పారదర్శకంగా పనిచేస్తూ అందరికీ న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం సూచించినట్లు కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. కార్యక్రమంలో నాతవరం ఎంపీడీవో శ్రీనివాస్, రావికమతం ఎంపీడీవో మహేశ్ పాల్గొన్నారు.

News December 10, 2025

ప్రపంచంలోనే అతి పొడవైన హైవే ఇదే..!

image

ప్రపంచంలోకెల్లా అతి పొడవైన రహదారి ‘పాన్-అమెరికన్’ హైవే అని మీకు తెలుసా? దీని పొడవు దాదాపు 30,000 కిలోమీటర్లు. ఇది అలాస్కాలోని ప్రుడో బే నుంచి మొదలై ఎలాంటి యూటర్న్ లేకుండా 14 దేశాల గుండా అర్జెంటీనా వరకు విస్తరించి ఉంది. ఈ రహదారి మెక్సికో, పనామా, కొలంబియా, పెరూ, చిలీ వంటి దేశాలను కలుపుతుంది. వర్షారణ్యాలు, ఎడారులను దాటే ఈ మార్గంలో ప్రయాణం పూర్తి చేయడానికి సగటున 60 రోజులు పడుతుంది.

News December 10, 2025

పోలింగ్‌ను సజావుగా నిర్వహించాలి: NRPT కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను నిర్ణీత సమయంలో ప్రారంభించి ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా ముగించాల్సిందిగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మొదటి విడత ఎన్నికలు జరగనున్న మద్దూరులో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణలో జాగ్రత్తలు, పోలింగ్ సామాగ్రి పంపిణీ విధానం, సిబ్బంది కట్టుదిట్టమైన సమన్వయం వంటి అంశాలపై సూచనలు ఇచ్చారు.