News November 6, 2025
వనపర్తి: వరి కోత యంత్రాల రేట్లు పెంచితే ఫిర్యాదు చేయండి- MLA

వరి కోత యంత్రాల యజమానులు రేట్లు పెంచితే ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యే మేఘ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వనపర్తి నియోజకవర్గ పరిధిలోని అన్నదాతలకు మీ వరి పంట కోత సమయంలో యంత్రాల యజమానులు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ రేట్లు వసూలు చేస్తే వ్యవసాయ అధికారులకు గాని, ఆర్టీవో, పోలీసు యంత్రాంగానికి ఫిర్యాదు చేయాలని కోరారు.
Similar News
News January 19, 2026
యాదాద్రి జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి పర్యటన

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9:30కు యాదగిరిగుట్ట స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం సైదాపురంలో అంగన్‌వాడీ భవనాలు, సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేస్తారు. యాదగిరిగుట్ట, ఆలేరులో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం 1:30కు మాటూరులో సబ్ స్టేషన్ పనులను ప్రారంభిస్తారు.
News January 19, 2026
ప్రపంచ ఆర్థిక సదస్సులో ఎంపీ చామల

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొంటున్నారు. ‘స్వనితి’ ఆధ్వర్యంలో నిర్వహించిన “ది మెరిడియన్ కలెక్టివ్” కార్యక్రమంలో ఆయన హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, పాలన, సుస్థిర లక్ష్యాలపై ఈ సదస్సులో ఆయన చర్చించనున్నారు. అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర ప్రగతిని చాటిచెప్పేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని ఎంపీ కార్యాలయం తెలిపింది.
News January 19, 2026
మెదక్: ‘బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే’

రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీఐఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ డా. అవ్వారు వేణు కుమార్ డిమాండ్ చేశారు. మెదక్ పట్టణంలోని కేవల్ కిషన్ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల వాటా, ఆత్మగౌరవం కోసం పోరాడుతామన్నారు. త్వరలోనే మెదక్‌లో ఉమ్మడి జిల్లా స్థాయి ‘సామాజిక న్యాయ సభ’ను భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.


