News August 20, 2025

వనపర్తి: ‘వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరి’

image

వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని ఎస్పీ గిరిధర్ తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలు ఎదుటివారికి ఇబ్బందులు కలిగించకుండా నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. పెద్ద శబ్దాలతో లౌడ్ స్పీకర్లను ఉపయోగించకూడదని హెచ్చరించారు. విగ్రహాల ఏర్పాటుకు https://policeportal.tspolice.gov.in/index.htm అనే ఆన్‌లైన్ లింక్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News January 14, 2026

WPLలోనే తొలి ప్లేయర్

image

మహిళా ప్రీమియర్ లీగ్(WPL)లో రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగిన తొలి ప్లేయర్‌గా గుజరాత్ జెయింట్స్ బ్యాటర్ ఆయుషి సోనీ రికార్డులకెక్కారు. ముంబైతో మ్యాచులో 11 బంతుల్లో 14 పరుగులు చేసిన ఆమె భారీ షాట్లు ఆడటంలో తడబడ్డారు. దీంతో చేసేదేమీ లేక రిటైర్డ్ ఔట్‌గా క్రీజును వీడారు. ఆ తర్వాత వచ్చిన ఫుల్మాలి 15 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 36 రన్స్ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

News January 14, 2026

జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు: మంత్రి పార్థసారధి

image

జిల్లాలో రైతుల అవసరాలకు మించి యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి పార్థసారధి తెలిపారు. మంగళవారం నరసింహారావుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం‌ను సందర్శించి, రైతులు, అధికారులతో మాట్లాడారు. జిల్లాకు 10,073 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం 12 వేల టన్నుల నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం రైతులకు అధిక మొత్తంలో ఎరువులు అందజేస్తున్నామని మంత్రి వివరించారు.

News January 14, 2026

ఎంఎస్‌ఎంఈ పార్కుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి

image

దెందులూరు నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు తక్షణమే ప్రతిపాదనలు రూపొందించాలని పరిశ్రమల శాఖ రాష్ట్ర కార్యదర్శి యువరాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం సోమవరప్పాడులో పార్కు కోసం ప్రతిపాదించిన స్థలాన్ని కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఇతర అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించి, సమగ్ర నివేదిక పంపాలని ఈ సందర్భంగా ఆయన దిశానిర్దేశం చేశారు.