News August 20, 2025
వనపర్తి: 40.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

వనపర్తి జిల్లాలో 24 గంటల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. ఘనపూర్‌లో 40.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సీపీఓ భూపాల్ రెడ్డి తెలిపారు. అమరచింతలో 21.2 మి.మీ, మదనాపూర్‌లో 12.2, పెద్దమందడిలో 16.8, గోపాల్‌పేటలో 27.4, రేవల్లిలో 22.4, పానగల్‌లో 13.8, వనపర్తిలో 22.6, కొత్తకోటలో 14.6, ఆత్మకూరులో 6.6, పెబ్బేరులో 6.8, శ్రీరంగాపూర్‌లో 8.4, వీపనగండ్లలో 10.4, చిన్నంబావిలో 9.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
Similar News
News January 19, 2026
మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి: ఎస్పీ

భద్రాద్రి జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ రోహిత్ రాజు జిల్లాలోని పోలీసు అధికారులతో సోమవారం నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధికారులతో ఎస్పీ మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులందరూ బాధ్యతగా తమ విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల నియమావళిని అనుసరించి పటిష్ఠమైన ప్రణాళికను తయారు చేసుకోవాలని సూచించారు.
News January 19, 2026
టెక్కలి: ఒకేసారి మూడు ఉద్యోగాలకు ఎంపిక

టెక్కలి మండలం శాసనం గ్రామానికి చెందిన కె.జ్ఞానేశ్వరరావు అనే యువకుడు ఒకేసారి మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ఇండియన్ ఆర్మీ(టెక్నీకల్), SSC(CISF-GD), ఇండియన్ ఎయిర్ ఫోర్స్(అగ్నివీర్) ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. యువకుడు తండ్రి సాంబమూర్తి రైతు కాగా తల్లి వరలక్ష్మీ గృహిణి. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగి ఒకేసారి మూడు కేంద్ర బలగాల్లో ఉద్యోగాలు సాధించడంపై యువకుడిని పలువురు ప్రశంసించారు.
News January 19, 2026
నారాయణపేట: గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

నారాయణపేట జిల్లాలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ శ్రీను అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 26న ఉదయం 9 గంటలకు పోలీస్ పరేడ్ మైదానంలో కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు. సాంస్కృతిక ప్రదర్శనలు, శకటాల ప్రదర్శన, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.


