News May 7, 2025
వనపర్తి: ‘BRS వాళ్లను తరిమికొడతారు’

వరంగల్ BRS పార్టీ రజతోత్సవ సభపై బంజారా గిరిజన విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు శివ నాయక్ ఓ ప్రకటనలో మండిపడ్డారు. ‘దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మోసం చేసినందుకు సభ నిర్వహిస్తున్నారా కేసీఆర్? 10 సంవత్సరాల పాటు తెలంగాణ బిడ్డలను మోసం చేసిన చరిత్ర BRS పార్టీది కాదా? మీరు ఎన్ని సభలు పెట్టినా.. ఎన్ని లిక్కర్లు పంచినా ప్రజలు మాత్రం మిమ్మల్ని తరిమి కొడతారు’ అని ఫైరయ్యారు.
Similar News
News February 16, 2026
అనకాపల్లి: బిల్ గేట్స్ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతిలో బిల్ గేట్స్‌తో జరిగిన సమావేశంలో అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ వర్చువల్‌గా పాల్గొన్నారు. జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను వారు వివరించారు. ఆర్టీజీఎస్ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను తెలియజేశారు.
News February 16, 2026
కామారెడ్డి జిల్లాలో పుర పీఠాలు వీరివే..!

1. కామారెడ్డి ఛైర్ పర్సన్ – ఇప్ప ఉమారాణి (కాంగ్రెస్)
వైస్ ఛైర్ పర్సన్ – కాసర్ల గోదావరి (బీఆర్ఎస్)
2. ఎల్లారెడ్డి ఛైర్మన్ – పద్మా శ్రీకాంత్ (కాంగ్రెస్)
వైస్ ఛైర్ పర్సన్ – మత్తమాల భాగ్యవతి (కాంగ్రెస్)
3. బిచ్కుంద ఛైర్ పర్సన్ – సీమా శెట్కార్(కాంగ్రెస్)
వైస్ ఛైర్ పర్సన్ – భాగ్యలక్ష్మి (కాంగ్రెస్)
4. బాన్సువాడ ఛైర్ పర్సన్- కాసుల విజయ (కాంగ్రెస్)
వైస్ చైర్ పర్సన్- రేష్మా ఏజాజ్ (కాంగ్రెస్)
News February 16, 2026
ఆమదాలవలస: రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి

ఆమదాలవలస(శ్రీకాకుళం రోడ్డు) రైల్వే స్టేషన్ కుద్దిరాం రైల్వే గేట్ సమీపంలో ఇవాళ జరిగిన రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారంంతో జీఆర్‌పీ ఎస్ఐ మధుసూదనరావు ఘటనా స్థలాని చేరుకొని డెడ్ బాడీని పరిశీలించారు. మృతునికి 45 ఏళ్లు ఉంటాయని, గళ్ల చొక్కా, నలుపు రంగు ఫ్యాంట్‌ను ధరించినట్లు చెప్పారు. వివరాలు తెలిసిన వారు స్థానిక జీఆర్పీ స్టేషన్ సంప్రదించాలన్నారు. దీనిపై కేసు నమోదైంది.


