News March 4, 2025
వనపర్తి: NAAC గ్రేడ్ మెరుగుపడేదెలా…!

జాతీయ మదింపు గుర్తింపు మండలి న్యాక్ గ్రేడ్ సాధనలో ఉమ్మడి జిల్లాలోని పీయూ పరిధిలోని డిగ్రీ కళాశాలలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. న్యాక్ గుర్తింపులో ఇప్పటివరకు గ్రేడ్ బి++ మాత్రమే ఉండగా జడ్చర్లలోని డా.బీఆర్ఆర్ డిగ్రీ కళాశాల తొలిసారిగా న్యాక్ ఎ-గ్రేడ్ సాధించింది. ఇది ఉమ్మడి జిల్లా చరిత్రలో ఓ నూతన అధ్యాయమని చెప్పొచ్చు. న్యాక్ గుర్తింపు ఉంటేనే కేంద్ర ప్రభుత్వం కళాశాలలకు నిధులు కేటాయిస్తోంది.
Similar News
News December 9, 2025
ఆర్థిక సమస్యలను తొలగించే ‘ద్వార లక్ష్మీ పూజ’

ఇంటి గడపను లక్ష్మీ ద్వారంగా భావించి, దేవతలను ఆహ్వానించడానికి పసుపు, కుంకుమలతో అలంకరిస్తాం. అయితే 16 రోజులు ‘ద్వార లక్ష్మీ పూజ’ ఆచరిస్తే ఆర్థిక సమస్యలు తొలగి, కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా పెళ్లికాని ఆడపిల్లలు, జాతక దోషంతో బాధపడుతున్నవారు ఈ పూజ చేయాలని సూచిస్తున్నారు. లక్ష్మీ ద్వార పూజ ఎప్పుడు, ఎలా చేయాలి? పూజా ఫలితాలు తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News December 9, 2025
గొర్రెల మందలో విత్తన పొట్టేలు ప్రాముఖ్యత(2/2)

ప్రతీ రెండు నుంచి మూడేళ్లకు ఒకసారి విత్తన పొట్టేలును మార్చాలి. ఎంపిక చేసుకునే పొట్టేలు దృఢంగా, ఎత్తుగా, చురుకుగా, ఎక్కువ బరువు, అధిక లైంగికాసక్తి కలిగి ఉండాలి. ముఖ్యంగా కవల పిల్లలను కనే సంతతి నుంచి వచ్చిన పొట్టేలును ఎంచుకోవడం చాలా మంచిదని వెటర్నరీ నిపుణులు సూచిస్తున్నారు. రెండేళ్లకు పైన వయసున్న పొట్టేలును మాత్రమే ఎంచుకోవాలి. మరింత సమాచారం కోసం వెటర్నరీ నిపుణుల సలహా తీసుకోవాలి.
News December 9, 2025
నేటి నుంచి లారీల బంద్

AP: టెస్టింగ్, ఫిట్‌నెస్ ఛార్జీలను తగ్గించాలనే డిమాండ్‌తో ఇవాళ అర్ధరాత్రి నుంచి గూడ్స్ రవాణా నిలిపివేస్తున్నట్లు లారీ ఓనర్ల సంఘం ప్రకటించింది. దాదాపు 10వేల లారీలు నిలిచిపోనుండటంతో కూరగాయలు, నిత్యావసరాలు, ధాన్యం, రేషన్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడనుంది. 13 ఏళ్ల వాహనాల ఫిట్‌నెస్ ఫీజు గతంలో రూ.1,400 ఉండగా కొత్త నిబంధనల ప్రకారం రూ.33వేలు చెల్లించాల్సి వస్తోందని లారీల ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


