News November 19, 2025

వయోవృద్ధులకు జిల్లా యంత్రాంగం అండగా ఉంది: కలెక్టర్

image

వయోవృద్ధులకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో షామీర్‌పేటలోని రుద్రమదేవి ఓల్డ్ హోమ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వయోవృద్ధుల కోసం ప్రత్యేక సంక్షేమ చట్టం ఉందని, తల్లిదండ్రులను సరిగా చూసుకోని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు.

Similar News

News January 14, 2026

NZB: మత్తు మందు ఇచ్చి దొంగతనం.. ముఠా అరెస్ట్

image

వ్యాపారం పేరిట మాయమాటలు చెప్పి, మత్తు మందు కలిపిన బీరు ఇచ్చి నగలు దొంగిలించిన ముఠాను నిజామాబాద్ టౌన్-4 పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడు శ్రీనివాస్ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రసాద్, నర్సింగరావు, రుద్రా యాదవ్ అనే ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి నగదు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఏపీల్లో వీరు పలు నేరాలకు పాల్పడినట్లు ఎస్హెచ్ఓ సతీశ్ కుమార్ తెలిపారు.

News January 14, 2026

రేవంత్‌-CBN రహస్య ఒప్పందం కుదరదు: కాకాణి

image

AP: రాయ‌ల‌సీమ‌, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల‌కు సంజీవ‌ని వంటి రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించాల్సిందేన‌ని YCP నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. TG CM రేవంత్‌తో చేసుకున్న ఒప్పందాన్నిCBN రద్దు చేసుకోవాలన్నారు. క్లోజ్డ్‌డోర్ భేటీలో జరిగిన ఈ ఒప్పందంపై రేవంత్ మాటల్ని CBN ఖండించకపోగా ఏవేవో చెబుతూ మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు కోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు.

News January 14, 2026

ర్యాంకింగ్స్‌లో నంబర్-1 ప్లేస్‌లో ఇండియా

image

ICC లేటెస్ట్ ర్యాంకింగ్స్‌లో IND అదరగొట్టింది. వన్డేల్లో 122 పాయింట్లతో తొలి ప్లేస్‌లో నిలిచింది. T20ల్లో 272 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. వన్డే బ్యాటింగ్‌లో కోహ్లీ, T20ల్లో అభిషేక్ శర్మ అగ్రస్థానంలో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో టెస్టుల్లో బుమ్రా, T20ల్లో వరుణ్ చక్రవర్తి ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో టెస్టుల్లో జడేజా మొదటి స్థానంలో ఉన్నారు.