News October 5, 2025
వయోవృద్ధుల దర్శనంపై టీటీడీ కీలక ప్రకటన

వయోవృద్ధుల దర్శనంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని TTD మరో మారు విజ్ఞప్తి చేసింది. ‘రోజూ 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం TTD 3నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేస్తోంది. తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పీహెచ్‌సీ లైన్ ద్వారా రోజూ మధ్యాహ్నం 3గంటలకు దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు సరైన సమాచారానికి www.tirumala.org వెబ్‌సైట్ చూడాలి’ అని TTD కోరింది.
Similar News
News January 22, 2026
మెదక్: ‘ప్రశ్నిస్తున్నందుకే సిట్ ప్రేమ లేఖలు’

ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే తనతో పాటు కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. వీటిని ఆయన రేవంత్ రెడ్డి సర్కార్ పంపిస్తున్న ‘ప్రేమ లేఖలు’గా అభివర్ణించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడబోమని, ప్రజా సమస్యలపై గొంతు ఎత్తుతూనే ఉంటామని సీఎంకు సవాల్ విసిరారు. సమాధానం చెప్పలేకనే ప్రభుత్వం ఇలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు.
News January 22, 2026
‘మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలి’

నంద్యాల జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని కలెక్టర్ రాజకుమారి గణియా ఆదేశించారు. గురువారం సీఎస్ విజయ్ ఆనంద్ సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. వసతి గృహాల నిర్వహణపై సమీక్షించిన కలెక్టర్, యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎక్కడా అలసత్వం వహించకూడదని ఆమె స్పష్టం చేశారు.
News January 22, 2026
జగిత్యాల: ‘ఆరు నెలలకోసారి వడ్డీ చెల్లించాలి’

రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలల్లో తీసుకున్న క్రాప్ లోన్లకు ప్రతి 6నెలలకోసారి 7% వడ్డీ చెల్లించి 3% వడ్డీ తిరిగి పొందాలని పెగడపల్లి, నందగిరి, నంచర్ల సహకార సంఘాల సీఈవోలు గోపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మధుకర్ కోరారు. 6నెలలకోసారి వడ్డీ చెల్లించిన రైతుకు 3%వడ్డీ తిరిగి రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారని అన్నారు. లేదంటే 13.75% అపరాధ వడ్డీ పడుతుందని తెలిపారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


