News November 19, 2025

వరంగల్‌ను ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దాలి: మేయర్ సుధారాణి

image

వరంగల్ నగరాన్ని ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని మేయర్ గుండు సుధారాణి అన్నారు. బుధవారం వరల్డ్ టాయిలెట్ డేను పురస్కరించుకుని బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌తో కలిసి మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన సెప్టిక్ ట్యాంక్, పబ్లిక్ టాయిలెట్ నిర్వాహకులను మేయర్ శాలువాలతో సత్కరించారు.

Similar News

News January 24, 2026

ఖమ్మం జిల్లాలో ఇసుక మాఫియాకు చెక్

image

ఇప్పటి వరకు విచ్చలవిడిగా సాగిన ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట పడనుంది. జిల్లాలో ఇసుక కావాల్సిన వారు ‘మన ఇసుక-మన వాహనం’ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే 24గంటల్లో డోర్ డెలివరీ చేస్తారు. క్వారీ నుంచి ఇంటి దూరాన్ని బట్టి ధర ఉంటుందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. వారంరోజుల్లో ఈ యాప్ అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.

News January 24, 2026

అధిక పాలిచ్చే పశువుకు ఉండే మరికొన్ని లక్షణాలు

image

పాడి పశువు నుంచి పాలు పిండిన తర్వాత పొదుగు ఒక రబ్బరు బుడగ గాలి తీసివేస్తే ఎలా అవుతుందో అలా అయిపోవాలి. అలా అవ్వని పొదుగును కండపొదుగు అంటారు. ఇది అధిక పాల దిగుబడికి పనికిరాదు. అంతేకాక పొదుగు మీద కనపడే రక్తనాళాలను గమనించాలి. వీటిని పాల సిరలు అంటారు. ఇవి పెద్దవిగా, ఎక్కువ పొడవుగా ఉండాలి. అలా ఉంటే పొదుగుకు అధిక రక్త సరఫరా జరిగి, పాల దిగుబడి పెరుగుతుంది. పొదుగు మీద చర్మం కూడా పలుచగా ఉండాలి.

News January 24, 2026

నెల్లూరు: అటవీ శాఖ సగానికి.. సగం ఖాళీ..!

image

జిల్లాలోని రాపూరు, ఆత్మకూరు, నెల్లూరు, కావలి, ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలో 2.29 లక్షల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. కాగా అటవీశాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. మొత్తం 167 పోస్టులకు 85 ఖాళీలు ఉండగా.. వాటిల్లో DRO 10 పోస్టులకు అన్నీ ఖాళీగా ఉన్నాయి. FSO 21 పోస్టులకు 7, FBO 75 పోస్టులకు 22, ABO 61 పోస్టులకు 57 ఖాళీలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎర్రచందనం పక్కదారి పట్టడానికి ఇదొక కారణమని తెలుస్తోంది.