News November 6, 2025
వరంగల్‌లో మల్టీ లెవల్ పార్కింగ్..!

వరంగల్ నగరంలో పార్కింగ్ సమస్యకు కుడా అధికారులు చెక్ పెట్టేందుకు అడుగులు వేస్తున్నారు. భద్రకాళి ఆలయం ఎదురుగా ఉన్న 3 ఎకరాల స్థలంలో రూ.20 కోట్ల వ్యయంతో ఒకేసారి 600 కార్లను 5 ఫ్లోర్లలో మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే HYD బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు సమీపంలో ఏర్పాటు చేశారు. అదే తరహాలో వరంగల్‌లో ఏర్పాటుకు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(KUDA) అడుగులు వేస్తోంది.
Similar News
News January 23, 2026
నందమూరులో మూడో రోజు జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్

నందమూరులోని శ్రీ వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో జేఈఈ మెయిన్స్ పరీక్షలు మూడో రోజు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం సెషన్‌లో 180 మందికి గాను 172 మంది విద్యార్థులు హాజరుకాగా, 8 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన రెండో సెషన్‌లో 180 మందికి గాను 174 మంది విద్యార్థులు పరీక్ష రాశారని, ఆరుగురు హాజరు కాలేదని కళాశాల ప్రిన్సిపల్ వెల్లడించారు.
News January 23, 2026
INDvsNZ 4వ T20.. టికెట్లు విడుదల

భారత్-న్యూజిలాండ్ మధ్య 28వ తేదీన జరగనున్న 4వ T20కి టికెట్లు విడుదలయ్యాయి. ఏపీ విశాఖలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంలో బుధవారం రాత్రి 7గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు district యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.
News January 23, 2026
‘MSVPG’కి పెంచిన టికెట్ ధరల లెక్కలు ఇవ్వండి: HC

TG: చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించి వాస్తవ లెక్కలను సమర్పించాలని GST అధికారులను హైకోర్టు ఆదేశించింది. చట్టవిరుద్ధంగా టికెట్ ధరలను పెంచారని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. రూ.45 కోట్లు అక్రమంగా సంపాదించారని, వాటిని రికవరీ చేయాలని పిటిషనర్ శ్రీనివాస రెడ్డి కోరారు. కోర్టు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది.


