News January 11, 2026
వరంగల్‌లో PDS బియ్యం సీజ్.. వ్యాపారుల కుమ్ములాట..!

రేషన్ బియ్యం దొంగల వ్యవహారం బయట పడింది. వరంగల్‌కు చెందిన రెండు వర్గాలు హన్మకొండలో రేషన్ బియ్యం దందా చేసే వారికి అమ్ముకునేందుకు ఉర్సుగుట్ట వద్ద ఓగోడౌన్‌లో 75 క్వింటాళ్ల రేషన్ బియ్యం దాచారు. పోలీసులు గోడౌన్ పై దాడులు నిర్వహించి బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. హన్మకొండ వ్యాపారుల వల్లే బియ్యం పట్టుకున్నారని వరంగల్ వ్యాపారులు గొడవపడగా స్థానిక పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.
Similar News
News January 14, 2026
తెలుగు సాంప్రదాయాలను కాపాడాలి: ఎమ్మెల్యే బేబినాయన

తెలుగు సంప్రదాయాలను కాపాడాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. బాడంగి మండలం గజరాయునివలసలో బుధవారం ఎద్దులతో బండ లాగుడు పోటీలను ఆయన ప్రారంభించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రైతులకు బండ లాగుడు పందెం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 15 గ్రామాల నుంచి రైతులు పాల్గొన్నారు.
News January 14, 2026
KCRను తిట్టేందుకు కవిత చాలు: కోమటిరెడ్డి

TG: BRS, KCRను విమర్శించాల్సిన అవసరం తమకు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ‘BRS, KCRను తిట్టేందుకు ఆయన కుమార్తె కవిత చాలు. KCR ₹7లక్షల కోట్ల అప్పు చేస్తే వాటిని చెల్లిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. బంగారు తెలంగాణ చేశామని చెప్పిన KCR అధికారం కోల్పోయిన 6నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తే ఒక్క సీటూ సాధించలేదు. ఆ పార్టీ గురించి ప్రజలు చూసుకుంటారు’ అని వ్యాఖ్యానించారు.
News January 14, 2026
ఇరాన్‌పై అమెరికా ఎందుకు అటాక్ చేయట్లేదంటే..

ఇరాన్ పాలకులపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మండిపడుతున్నారు కానీ మిలిటరీ అటాక్ చేయట్లేదు. దీనికి ముఖ్య కారణం.. OCT నుంచి మిడిల్ ఈస్ట్‌లో US ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లేకపోవడమే. ఏదైనా మిస్సైల్, ఎయిర్ అటాక్ చేయాలంటే ఖతర్, బహ్రెయిన్, ఇరాక్, సౌదీ, యూఏఈలోని బేస్‌లను వాడుకోవాల్సి ఉంటుంది. ఇరాన్ ప్రతిదాడి చేస్తుంది కాబట్టి అందుకు ఆ దేశాలు ఒప్పుకోవు. ఒకవేళ B2 బాంబర్లు వాడితే భారీగా పౌరులు మరణిస్తారు.


