News October 8, 2025

వరంగల్: ఆగేనా.. సాగేనా.. మరికొద్ది గంటల్లో తీర్పు..!

image

ఓ పక్క హైకోర్టు తీర్పు కోసం నిరీక్షణ, మరోవైపు ఎన్నికల కసరత్తు చూస్తే.. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల్లో కలవరం నెలకొంది. తీర్పు అనుకూలంగా వస్తే రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రిజర్వేషన్ల జీవో 9 రద్దు చేస్తే నామినేషన్ల స్వీకరణకు బ్రేక్ పడనుంది. బ్రేక్ పడితే పాత పద్ధతిలో ఎన్నికలు సాగిస్తారా?, మొత్తం ఎన్నికలు వాయిదా వేసి, సుప్రీంకోర్టు వెళ్తారా? అనే సందేహం ఆశావహుల్లో నెలకొంది.

Similar News

News January 18, 2026

ఖమ్మం:పురపాలక పీఠాలపై ‘మహారాణుల’ రాజ్యమే..

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మొత్తం 9 స్థానాల్లో (రెండు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలు) ఆరింటిని మహిళలకే కేటాయించారు. ఖమ్మం మేయర్, వైరా, సత్తుపల్లి, మధిర, అశ్వారావుపేటలను జనరల్ మహిళకు కేటాయించగా.. ఇల్లెందు బీసీ మహిళకు, ఏదులాపురం ఎస్సీ మహిళకు దక్కాయి. కల్లూరు, కొత్తగూడెంలు ఎస్టీ జనరల్ విభాగంలో ఉన్నాయి. పురపాలక పీఠాలపై మహిళల ఆధిపత్యం ఖాయమైంది.

News January 18, 2026

కడప: ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీనా.. ఫోన్ చేయండి.!

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు ఛార్జీలను విపరీతంగా పెంచాయి. దీంతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. దీనిపై రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. నిబంధనలకు లోబడి మాత్రమే ఛార్జీలను వసూలు చేయాలని ట్రావెల్స్ యజమానులకు సూచించారు. ఎవరైన అధిక ఛార్జీలు వసూలు చేస్తే 9281607001 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

News January 18, 2026

నకిలీ మద్యం మరణాలకు CBN బాధ్యత వహిస్తారా: వైసీపీ

image

AP: నకిలీ మద్యం తాగి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మరణించారంటూ ప్రభుత్వంపై YCP మండిపడింది. వీరి చావులకు సీఎం చంద్రబాబు బాధ్యత తీసుకుంటారా అని ‘ఎక్స్’లో ప్రశ్నించింది. అన్నమయ్య జిల్లాలో నిన్న సాయంత్రం ఫ్రెండ్స్‌తో కలిసి మద్యం సేవించిన మణికుమార్, పుష్పరాజ్ తీవ్ర అస్వస్థతకు గురై మరణించారని విమర్శించింది. ఎక్స్‌పైర్, నకిలీ మద్యం అమ్ముతూ TDP లిక్కర్ సిండికేట్ సొమ్ము చేసుకుంటోందని వైసీపీ ఆరోపించింది.