News November 19, 2025
వరంగల్: ‘ఆయన’ పెదవిపై చిరునవ్వు చెరగనివ్వడు!

ఆయన కష్టం ఎవరికీ కనిపించదు. సంతోషాన్ని పంచుకుంటాడు. బాధను దిగమింగుకుంటాడు. పెదవిపై చిరునవ్వు చెరగనివ్వకుండా సమాజంతో పోటీ పడతాడు. చెమట చిందిస్తూ, శ్రమనే నమ్ముకొని నిత్యం కుటుంబం గురించే ఆలోచిస్తాడు. నిజానికి ఆయన రెక్కాడితేనే కుటుంబం నిలబడుతుంది. అలాంటి భర్తలకు తోడుగా ఉండాల్సింది పోయి ఉమ్మడి వరంగల్‌లోని కొందరు భార్యలు హత్యలకు పాల్పడుతున్నారు. ఆయనకు అండగా ఉందాం. నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సం.SHARE
Similar News
News January 24, 2026
APలో ఏర్పాటు కానున్న WEF C4IR కేంద్రం

AP: నాల్గవ పారిశ్రామిక విప్లవం కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(WEF) 5 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. అందులో ఒకటి రాష్ట్రంలో నెలకొల్పేందుకు నిర్ణయించింది. ఇండియా(AP), ఫ్రాన్స్, UK, UAEలలో ఇవి ఏర్పాటు కానున్నాయి. WEF 2017లో ప్రారంభించిన 4వ పారిశ్రామిక విప్లవ నెట్‌వర్క్ ప్రభుత్వ, ప్రైవేటు, పరిశ్రమల సమన్వయానికి ఒక వేదికగా పనిచేస్తోంది. ఇప్పటికే ఇండియాలో ఈ తరహా సెంటర్స్ హైదరాబాద్, ముంబైలో ఉన్నాయి.
News January 24, 2026
సంతాన ప్రాప్తి కోసం రేపు ఏం చేయాలంటే..?

సంతాన ప్రాప్తి కోరేవారు రథ సప్తమి రోజు బియ్యప్పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. సూర్య నామాలు స్మరిస్తూ దాన్ని 7 రంగులతో నింపాలి. పద్మం మధ్యలో శివపార్వతులను ఉంచి, పక్కనే తెల్లని వస్త్రంపై సూర్యరథపు ప్రతిమను ఉంచి ఎర్రని పూలతో పూజించాలి. గోత్రనామాలతో సంకల్పం చెప్పుకోవాలి. దాన్ని బ్రాహ్మణుడికి దానమివ్వాలి. ఏడాది పాటు ప్రతి సప్తమికి ఉపవాసం ఉంటూ, సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. తద్వారా ఫలితం ఉంటుంది.
News January 24, 2026
జిల్లా స్థాయి షార్ట్ ఫిలిం పోటీల్లో NGKL జిల్లావాసికి ప్రథమ బహుమతి

వనపర్తి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ (DLSA) నిర్వహించిన జిల్లా స్థాయి లఘు చిత్రాల పోటీల్లో లింగాల మండలం సురాపూర్ గ్రామానికి చెందిన అతినారపు సాయి సాగర్ మొదటి బహుమతి సాధించాడు. సామాజిక అవగాహన కోసం ఆయన రూపొందించిన చిత్రం న్యాయ నిర్ణేతల ప్రశంసలు పొందింది. బాధ్యతాయుతమైన చిత్రాలను రూపొందించినందుకు సాయి సాగర్‌ను గ్రామస్థులు అభినందించారు.


