News November 30, 2025

వరంగల్‌: ఎన్నికల పోలింగ్‌కు రెండేళ్లు!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2023 నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు నేటికి రెండేళ్లు పూర్తయ్యాయి. జిల్లాలోని 12 స్థానాల్లో కాంగ్రెస్ 10 స్థానాల్లో ఘన విజయం సాధించింది. వరంగల్ తూర్పు నుంచి గెలిచిన కొండా సురేఖ, ములుగు నుంచి గెలిచిన సీతక్క డిసెంబర్ 7న మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

Similar News

News February 17, 2026

TGSET- 2026హాల్ టికెట్లు విడుదల: జయశ్రీ

image

తెలంగాణ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ హాల్ టికెట్లు(TGSET- 2026) హాల్ టికెట్లు విడుదలయ్యాయని MHBD సాంఘిక సంక్షేమ గురుకులాల జిల్లా సమన్వయ అధికారి జయశ్రీ తెలిపారు. 2026-27 అకాడమిక్ ఇయర్ 5 నుంచి 9 వ తరగతి వరకు ప్రవేశాలకు అన్ని గురుకుల సెంటర్లలో ఈ పరీక్షలు ఉంటాయన్నారు. నేటి నుంచి ఈనెల 22 వరకు https://share.google/BU4yEpTenYgIcWeOY వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.

News February 17, 2026

విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు

image

అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు మంగళవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు MP శ్రీ భరత్, జాయింట్ కలెక్టర్ విద్యాదరి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. ఆయన ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన నగరంలోకి వెళ్లారు.

News February 17, 2026

గద్వాల్: ఈ నెల 23 నుంచి సర్పంచ్‌లకు శిక్షణ

image

కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఈనెల 23 నుంచి 27 వరకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎర్రవల్లిలోని 10వ పోలీస్ బెటాలియన్‌లో జరగనున్న ఈ శిబిరంలో నూతన పంచాయతీ రాజ్ చట్టం-2018పై సమగ్ర అవగాహన కల్పించనున్నారు. అయిజ, ఇటిక్యాల, రాజోలి, మానవపాడు, అలంపూర్, ఎర్రవల్లి మండలాల సర్పంచులు ఈ శిక్షణకు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు.