News November 19, 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 5 ఇసుక ట్రాక్టర్లు సీజ్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. రెండు వేర్వేరు ఘటనల్లో 5 కేసులు నమోదు చేసి, ఏడుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 15 టన్నుల ఇసుకతో పాటు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. వర్ధన్నపేట పరిధిలో నాలుగు, పాలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదైంది.
Similar News
News January 19, 2026
భద్రకాళి క్షేత్రంలో మాఘ నవరాత్రుల వైభవం

ఓరుగల్లు ఆరాధ్యదైవం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో మాఘ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారికి శాస్త్రోక్తంగా ‘పూర్ణాభిషేకం’ నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్ప మాలలతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి విశేష పూజలు, హారతులు సమర్పించారు. ప్రాతఃకాల దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
News January 19, 2026
నేటి నుంచి సర్పంచులకు శిక్షణ.. పంచాయతీ పాలనపై అవగాహన

నల్గొండ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు నేటి నుంచి ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ శిక్షణలో పంచాయతీరాజ్ చట్టం, గ్రామ పాలన, నిధుల వినియోగంపై అవగాహన కల్పిస్తారు. శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే రిసోర్స్ పర్సన్లను ఎంపిక చేశారు. జిల్లాలోని 869 పంచాయతీలకు గాను 866 గ్రామాల్లో పాలకవర్గాలు కొలువుదీరిన నేపథ్యంలో, వారికి తమ విధులు, బాధ్యతలపై పూర్తిస్థాయిలో పాఠాలు నేర్పనున్నారు.
News January 19, 2026
సర్పంచులకు పాఠాలు.. భద్రాద్రి జిల్లాలో శిక్షణకు సర్వం సిద్ధం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతనంగా ఎన్నికైన 468 మంది సర్పంచులకు రెండు విడతల్లో శిక్షణ ఇచ్చేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. పాల్వంచ నవభారత్‌లోని మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో ఐదు రోజుల పాటు ఈ తరగతులు జరగనున్నాయి. తొలి విడత శిక్షణ నేటి నుంచి 23 వరకు, రెండో విడత ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు కొనసాగనుంది.


