News November 19, 2025

వరంగల్ కమిషనరేట్ పరిధిలో 5 ఇసుక ట్రాక్టర్లు సీజ్

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. రెండు వేర్వేరు ఘటనల్లో 5 కేసులు నమోదు చేసి, ఏడుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 15 టన్నుల ఇసుకతో పాటు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. వర్ధన్నపేట పరిధిలో నాలుగు, పాలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదైంది.

Similar News

News January 15, 2026

U19 WC: టాస్ గెలిచిన టీమ్ ఇండియా

image

అండర్-19 వరల్డ్ కప్‌లో యూఎస్ఏతో మ్యాచులో టీమ్ ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
USA: ఉత్కర్ష్ శ్రీవాస్తవ(C), అద్నిత్, నితీశ్, అర్జున్ మహేశ్, అమరీందర్, సబ్రిశ్, అదిత్, అమోఘ్, సాహిల్, రిషబ్, రిత్విక్
ఇండియా: ఆయుశ్ (C), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, విహాన్, అభిజ్ఞాన్, హర్‌వంశ్, అంబ్రీశ్, కనిశ్ చౌహన్, హెనిల్ , దీపేశ్, ఖిలన్.
* మ్యాచ్ లైవ్ జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో చూడవచ్చు.

News January 15, 2026

RITESలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

image

RITESలో 7 అసిస్టెంట్ మేనేజర్(HR)పోస్టులకు అప్లై చేయడానికి ఈనెల 27 ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి MBA/PGDBM/PGDM/PGDHRM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.40,000-రూ.1,40,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://rites.com/

News January 15, 2026

తిరుపతి: భయపెడుతున్న టిప్పర్లు

image

తిరుపతి జిల్లా నుంచి తమిళనాడుకు భారీగా గ్రావెల్, ఇసుక, కంకర తరలిస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గం మీదుగా రోజుకు 250 నుంచి 300 వరకు టిప్పర్లు బార్డర్ దాటుతున్నాయి. కొన్ని అనుమతులు లేకుండా, మరికొన్ని నకిలీ బిల్లులతో తరలిస్తున్నారని సమాచారం. పుత్తూరు-చెన్నై మెయిన్ రోడ్డుపై రాత్రి వేళ టిప్పర్లు వేగంగా దూసుకెళ్తున్నాయి. ఆ మార్గంలో ప్రయాణాలంటేనే అందరూ హడలిపోతున్నారు.