News November 19, 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 121 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

మందు బాబులు వాహనాలు నడపడం కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 121 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ పరిధిలోనే 51 కేసులు ఉన్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, వాహనం సీజ్ చేసి కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు.
Similar News
News January 13, 2026
సంగారెడ్డి: కళాశాలలకు ప్రయోగశాల నిధులు

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో ప్రయోగశాలల బలోపేతానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఒక్కో కళాశాలకు రూ. 50,000 చొప్పున కేటాయించినట్లు ఇంటర్మీడియట్ విద్యాధికారి గోవింద్ రామ్ తెలిపారు. ప్రయోగ పరీక్షల సమయంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా, అవసరమైన రసాయనాలు, పరికరాలను ఈ నిధులతో కొనుగోలు చేయాలని ప్రిన్సిపల్‌లను ఆదేశించారు. దీంతో విద్యార్థులకు ప్రయోగాత్మక విద్య మరింత చేరువ కానుంది.
News January 13, 2026
వివేకా హత్య కేసులో YS సునీత మరో అప్లికేషన్

వివేకా హత్యకేసులో ఆయన కుమార్తె YS సునీత SCలో మరో అప్లికేషన్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు పాక్షికంగానే ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఆమె సవాలు చేశారు. తాము లేవనెత్తిన అంశాలకు విరుద్ధంగా HYD CBI కోర్టు పాక్షిక విచారణకు ఆదేశించినట్లు అప్లికేషన్‌లో పేర్కొన్నారు. విచారణను SC వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. కాగా CBI విచారణ కొనసాగింపుపై 3నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని SC గతంలోనే ట్రయల్ కోర్టును ఆదేశించింది.
News January 13, 2026
మాజీ మంత్రి సతీమణి లక్ష్మీదేవి కన్నీటి పర్యంతం

దివంగత మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సూర్యనారాయణ సతీమణి లక్ష్మీదేవిని ఓదార్చారు. తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి వివాహాన్ని తానే దగ్గరుండి చేయించానన్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎన్నడూ ఊహించలేదని బావోధ్వేగానికి గురయ్యారు.


