News October 8, 2025
వరంగల్ కలెక్టరేట్లో అతనే బాస్?

పలు శాఖల ఫైళ్లు ZP CEO ద్వారానే రావాలని ఏకంగా వరంగల్ కలెక్టర్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. ఈ ఆర్డర్ ఆధారంతో ఇతర శాఖల అధికారులపై CEO పెత్తనం చెలాయిస్తున్నారట. ఏకంగా మంత్రుల సిఫార్సు లేఖలు సైతం పక్కన పడేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. జిల్లాలో అడిషనల్ కలెక్టర్లు ఉన్నా ZP CEOకు అదనపు బాధ్యతలు ఇవ్వడంపై విమర్శలొస్తున్నాయి. తమకింద పనిచేయాల్సిన జెడ్పీ సిబ్బంది పెత్తనం ఏంటని రెవిన్యూ అధికారులు నిలదీస్తున్నారట.
Similar News
News January 16, 2026
లచ్చాపేటలో అత్యల్పంగా 13.0°C ఉష్ణోగ్రత

కామారెడ్డి జిల్లాలో గత 24 గంటల్లో (జనవరి 16 ఉదయం వరకు) నమోదైన వాతావరణ వివరాలను TGDPS విడుదల చేసింది. మాచారెడ్డి మండలం లచ్చపేటలో జిల్లాలోనే అత్యల్పంగా 13.0°C కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గాంధారి (13.1°C), దోమకొండ (13.5°C) మండలాల్లోనూ రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయి. ఇక కామారెడ్డి లో 18.3°C నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా వర్షపాతం లేదు, పొడి వాతావరణం కొనసాగుతోంది.
News January 16, 2026
NLG: ట్రాఫిక్ బిగ్ అలర్ట్.. వాహనాల దారి మళ్లింపు!

సంక్రాంతి ట్రాఫిక్ రద్దీ నివారణకు హైదరాబాద్ వెళ్లే వాహనాలకు పోలీసులు దారి మళ్లిస్తున్నారు.
1) GNTR- HYD వెళ్లే వాహనాలు :
GNTR→ MLG → HLY → కొండమల్లేపల్లి → చింతపల్లి – మాల్ మీదుగా HYD.
2) MCL- HYD వెళ్లే వాహనాలు :
MCL → సాగర్ → పెద్దవూర → కొండమల్లేపల్లి – చింతపల్లి-మాల్ మీదుగా HYD.
3) NLG- HYD వైపు వెళ్లే వాహనాలు :
NLG – మర్రిగూడ బై పాస్ -మునుగోడు → నారాయణపూర్- CPL ( హైవే 65) HYD.
News January 16, 2026
పల్నాడు జిల్లాలో కీలక పట్టణంగా పిడుగురాళ్ల!

పల్నాడు జిల్లాలో కీలక పట్టణంగా పిడుగురాళ్ల రూపుదిద్దుకుంటోంది. జిల్లాలో అతి పెద్దదైన పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం 2026-27లో 100 MBBS సీట్ల ప్రవేశం, బెడ్ల పెంపకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వ్యాపార కేంద్రమైన పిడుగురాళ్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజకీయ నేతలు సైతం పిడుగురాళ్ల కేంద్రంగా నియోజకవర్గ రాజకీయాలు పర్యవేక్షిస్తున్నారు.


