News October 7, 2025
వరంగల్: క్వింటా కొత్త పత్తి ధర రూ.7,100

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి ధరలు ఇలా ఉన్నాయి. సోమవారం క్వింటా కొత్త పత్తికి రూ.7,100 ధర రాగా.. ఈరోజు కూడా అదే ధర వచ్చినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. అలాగే, పాత పత్తి క్వింటాకు నిన్న రూ.7,350 ధర రాగా.. నేడు రూ.7,320కి తగ్గిందని పేర్కొన్నారు. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.
Similar News
News January 24, 2026
రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి: CBN

AP: రాష్ట్రానికి అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని CM చంద్రబాబు చెప్పారు. ‘ప్రపంచం మెచ్చే రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేశాం. చెడు ఆలోచనలతో నేరస్థులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో చూశాం. పద్ధతి లేని రాజకీయాలు ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు’ అని నగరిలో నిర్వహించిన ప్రజావేదికలో పేర్కొన్నారు.
News January 24, 2026
నెల్లూరుకు రూ.15 వేల కోట్లతో భారీ పరిశ్రమలు రాక

నెల్లూరు జిల్లాకు భారీ పరిశ్రమలు రానున్నాయి. ఇటీవల జరిగిన పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో 13 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఆయా కంపెనీలు MOU కుదుర్చుకున్నాయి. దీంతో జిల్లా పారిశ్రామిక నడవాగా మారనుంది. 13 పరిశ్రమల్లో రూ.15,403 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా 37,213 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. వీటిల్లో ఇప్పటికే 5 నుంచి 6 పరిశ్రమలకు భూ సేకరణ సైతం పూర్తి చేయగా.. మిగిలిన వాటికి స్థల సేకరణ జరుగుతోంది.
News January 24, 2026
NZB: ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను పరామర్శించిన కలెక్టర్

నిజామాబాద్ శివారులో తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంగా గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లు కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ జి.సౌమ్యను కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సౌమ్య కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.


