News February 5, 2025
వరంగల్: క్వింటా పత్తి ధర రూ. 6,980

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,000 పలకగా.. మంగళవారం రూ.6,960కి పడిపోయింది. అలాగే నేడు రూ.20 పెరిగి రూ.6,980 కి చేరినట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. గత వారం క్రమంగా పెరుగుతూ వచ్చిన పత్తి ధర ఇప్పుడు తగ్గుతుండటంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.
Similar News
News February 8, 2026
రేపు భూపాలపల్లికి రానున్న కేటీఆర్

మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో రేపు భూపాలపల్లిలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 9:30 గంటలకు స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగియనుండటంతో BRS శ్రేణులు హోరెత్తిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
News February 8, 2026
ఏలూరు జిల్లాలో ఈనెల 9 నుంచి పక్వాడా కార్యక్రమం

ఏలూరు: జిల్లాలో ఈనెల 9 నుంచి 23 వరకు స్మార్ట్ మీటర్ల పక్వాడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్‌ఈ సాల్మన్ రాజు తెలిపారు. స్మార్ట్ మీటర్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. మొబైల్ యాప్‌ల ఇన్‌స్టాలేషన్, ప్రత్యక్ష ప్రదర్శనలు, ప్రజా ప్రదేశాల్లో ప్రత్యేక సహాయక కేంద్రాల ద్వారా వినియోగదారుల సందేహాలను నివృత్తి చేస్తామన్నారు.
News February 8, 2026
నిద్ర ఎక్కువైనా ప్రమాదమే!

* ఎక్కువ సమయం నిద్రపోతే బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.
* ఇన్సులిన్‌ను నియంత్రించే హార్మోన్లపై ప్రభావం పడుతుంది.
* మహిళల్లో సంతానోత్పత్తి సమస్య వచ్చే ప్రమాదం ఉంది.
* కండరాలు, నరాలు సంకోచించి శారీరకంగా అలసిపోతారు.
* తలనొప్పి, వెన్నునొప్పి వస్తాయి. డిప్రెషన్‌కు గురవుతారు.
* అలసట, నీరసంగా అనిపించి జంక్‌ఫుడ్/అధిక కేలరీలున్న ఫుడ్ తినడంతో బరువు పెరిగే ప్రమాదం ఉంది.


