News September 12, 2025
వరంగల్: క్వింటా పత్తి ధర రూ. 7,550

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు అన్నదాతలను అయోమయానికి గురి చేస్తున్నాయి. గురువారం క్వింటా పత్తి ధర రూ.7,545 పలకగా.. నేడు రూ.7,550కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు. కాగా, ఈ వారం మొదటి నుంచి పత్తి ధరలు చూస్తే.. సోమవారం రూ.7,530, మంగళవారం రూ.7,580, బుధవారం రూ.7,555 పలికాయి.
Similar News
News December 14, 2025
విశాఖ సెంట్రల్ జైలు ఖైదీలకు భగవద్గీత బోధన

విశాఖ కేంద్ర కారాగారంలో ఖైదీలకు మానసిక రుగ్మతలను జయించేందుకు, ప్రశాంతమైన జీవితాన్ని జీవించేందుకు భగవద్గీతను బోధించారు. భగవద్గీత మానవాళి జీవితానికి దిశా నిర్దేశంగా ఉంటుందని ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. భగవద్గీతను అనుసరిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని జీవించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు, జైలు సిబ్బంది పాల్గొన్నారు.
News December 14, 2025
దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే: ఖర్గే

ఓట్ చోరీకి పాల్పడే వారు ద్రోహులని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఫైరయ్యారు. ఓటు హక్కు, రాజ్యాంగాన్ని కాపాడాలంటే BJPని అధికారం నుంచి దింపేయాలని పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ భావజాలాన్ని బలోపేతం చేయడం భారతీయుల బాధ్యత. దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే. RSS ఐడియాలజీ దేశాన్ని నాశనం చేస్తుంది’ అని ఆరోపించారు. తన కొడుక్కు ఆపరేషన్ ఉన్నా వెళ్లలేదని, 140 కోట్ల మందిని కాపాడటమే ముఖ్యమని ర్యాలీకి వచ్చానని తెలిపారు.
News December 14, 2025
MDK: 2 ఓట్లతో స్వప్న విజయం

నిజాంపేట మండలం నందిగామలో బీజేపీ మద్దతుదారు షేరి స్వప్న 2 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. గ్రామంలో వారి మద్దతుదారులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన పాలక వర్గం ఆధ్వర్యంలో గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుపోతామని వారు పేర్కొన్నారు. నమ్మకంతో గెలిపించిన గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు.


