News November 6, 2025

వరంగల్: గురుకుల ఘటనపై కలెక్టర్ సీరియస్..!

image

వరంగల్ జిల్లా పర్వతగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి <<18190237>>విద్యార్థిని వల్లందాసు శివానిని పాఠశాల నుంచి పంపించిన ఘటనపై <<>>కలెక్టర్ డాక్టర్ సత్య శారద సీరియస్ అయ్యారు. ఘటనకు సంబంధించి బుధవారం ప్రిన్సిపల్‌తో పాటు విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులను తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులపై కలెక్టర్ మండిపడినట్లు సమాచారం. విద్యార్థినిని పాఠశాలలో చేర్చుకోవాలని ఆదేశించారు.

Similar News

News January 24, 2026

భార్య సూచననే పాటించా: సూర్య కుమార్

image

468 రోజుల తర్వాత <<18940538>>అర్ధసెంచరీ<<>> చేసిన సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తిరిగి ఫామ్‌లోకి రావడానికి భార్య దేవిషా ఇచ్చిన సలహానే కారణమని చెప్పారు. క్రీజులో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకోమని ఆమె సూచించినట్లు తెలిపారు. న్యూజిలాండ్‌తో ఆడిన రెండు టీ20ల్లో ఇదే పాటించానని SKY పేర్కొన్నారు. నిన్నటి మ్యాచులో 37 బంతుల్లో 82 రన్స్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే.

News January 24, 2026

నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై చర్యలు: KMR కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులన్నీ తప్పనిసరిగా ‘క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2010’ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. శనివారం ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు, డాక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఆర్ఏ కమిటీకి సమర్పించిన ప్రైస్ లిస్ట్ ప్రకారమే రోగుల నుంచి ఫీజులు వసూలు చేయాలని, ఆసుపత్రిలో సిబ్బంది మారితే అధికారులకు తెలపాలన్నారు.

News January 24, 2026

జిల్లాల విభజనపై ఎలాంటి ప్రకటన చేయలేదు: నాయిని

image

జిల్లాల విభజనపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సీఎల్పీ మీడియా హాల్‌లో ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎన్నికల కోసమే బీఆర్ఎస్ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చి ఇంకా రెండున్నర సంవత్సరాలే అవుతుందన్నారు. అయినా కేసీఆర్ కుటుంబం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎందుకు బట్టలు చించుకుంటోందో చెప్పాలని స్పష్టం చేశారు.