News October 7, 2024
వరంగల్: గ్రామాల్లో మొదలైన ‘పంచాయతీ’ సందడి!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునే ఆశావహులు అందరినీ ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అధికారులు ఓటరు తుది జాబితాను విడుదల చేశారు. ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. దీంతో పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. వరంగల్ జిల్లాలో 325, హనుమకొండ- 208, మహబూబాబాద్-461, జనగామ-283, ములుగు -174, భూపాలపల్లి – 240 గ్రామ పంచాయతీలున్నాయి.
Similar News
News November 13, 2024
వరంగల్: తగ్గిన పత్తి ధర
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు ఈరోజు తీవ్ర నిరాశ ఎదురైంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర భారీగా పతనమైంది. సోమవారం రూ. 6,960 పలికిన క్వింటా కొత్త పత్తి ధర, మంగళవారం రూ.7,000కి పెరిగింది. అయితే ఈరోజు ఎవరూ ఊహించని విధంగా దారుణంగా పతనమై రూ.6,860కి పడిపోయింది. దీంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
News November 13, 2024
ఎనుమాముల మార్కెట్‌కు మూడు రోజుల సెలవు
వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించారు. ఈ నెల 15న గురునానక్ జయంతి, 16న వారాంతపు సెలవు, 17 ఆదివారం సెలవు దినాలని మార్కెటింగ్ ఉన్నత శ్రేణి కార్యదర్శి నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి ఈ నెల 18న సోమవారం మార్కెట్ పునః ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కావున రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News November 13, 2024
HNK: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన HNK జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన గడ్డం శరణ్య (15) ఇంటర్ చదువుతోంది. దీపావళి సెలవులకు ఇంటికి వచ్చింది. మంగళవారం కాలేజీకి వెళ్లాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు.