News March 2, 2025
వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు ఇలా..

వరంగల్ జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. లైవ్ కోడి కిలో రూ.120 పలకగా.. విత్ స్కిన్ KG రూ.130-140 పలకగా, స్కిన్‌లెస్ KG రూ.160 పలుకుతోంది. అయితే గత వారంతో పోలిస్తే ఈరోజు ధరలు స్వల్పంగా పెరిగాయి. బర్డ్స్ ఫ్లూ ప్రభావంతో స్వల్పంగా అమ్మకాలు పడిపోయాయని నిర్వాహకులు తెలుపుతున్నారు. కాగా.. సిటీతో పోలిస్తే పల్లెలలో రూ.10-20 ధర వ్యత్యాసం ఉంది.
Similar News
News March 21, 2025
నల్లబెల్లి: తల్లిదండ్రుల కల నెరవేర్చిన కుమారుడు

తల్లిదండ్రుల కలను ఓ కుమారుడు నెరవేర్చాడు. నల్లబెల్లి మండల పరిధిలో నిరుపేద కుటుంబానికి చెందిన మొగిలి, పద్మ దంపతుల కుమారుడు బొట్ల కార్తీక్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 2023 టీఎస్పీఎస్పీ సివిల్ ఇంజినీరింగ్ పరీక్షలో భద్రాద్రి జోన్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వరంగల్ జిల్లా టెక్నికల్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించాడు.
News March 20, 2025
వరంగల్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి జరిమానా

వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పరిచారు. 21 మందిని వరంగల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అబ్బోజు వెంకటేశం ముందు హాజరు పరచగా.. వారికి రూ.20,600 జరిమానా విధించారు. అలాగే లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన మరో నలుగురికి రెండు వేల జరిమానా విధించినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.
News March 20, 2025
మహిళ సాధికారతకు ప్రభుత్వ కృషి: మంత్రి

మహిళ సాధికారతకు ప్రభుత్వ కృషి చేస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని దేశాయిపేట దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌ను ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక పురోగతికి అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకురావడం జరిగిందన్నారు.