News September 11, 2025
వరంగల్ జిల్లాలో రైల్వే లైన్లను అభివృద్ధి చేయాలి: CM

తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రాజెక్టుల విషయాలపై రైల్వేతో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వరంగల్ జిల్లాలో రైల్వే లైన్లను అభివృద్ధి చేయాలని, భూపాలపల్లి నుంచి వరంగల్ కొత్త మార్గాన్ని పరిశీలించాలని చెప్పారు. కాజీపేట జంక్షన్‌లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం అన్నారు.
Similar News
News December 17, 2025
ఖమ్మం: ముగిసిన మూడో విడత.. 86.65% ఓటింగ్

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 86.65 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా వెల్లడించారు. పోలింగ్ ముగియడంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించి ఫలితాలను వెల్లడించనున్నారు.
News December 17, 2025
ఇబ్బందులు సృష్టిస్తే కఠిన చర్యలు: నిర్మల్ ఎస్పీ

చివరి దశ పంచాయతీ ఎన్నికల్లో ఐదు మండలాల్లో ఇబ్బందులు కలిగించి ఎన్నికల విధులకు ఆటంకం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకి షర్మిల స్పష్టం చేశారు. బుధవారం ముధోల్, బాసర, తానూరు తదితర పోలింగ్ కేంద్రాలకు సందర్శించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ సిబ్బంది, భద్రత సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించారన్నారు.
News December 17, 2025
గొల్లపల్లి : పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా ఎస్పీ

గొల్లపల్లి (M) ఇబ్రహీంనగర్, గొల్లపల్లి, పెగడపల్లి (M) బతికపల్లి, నంచర్ల గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను బుధవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


