News May 7, 2025
వరంగల్ జిల్లాలో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. ఖిలా వరంగల్-42.6, ములుగు రోడ్డు-42.9, సీరోలు(MHBD)-42.4, జఫర్‌గడ్(జనగామ)-42.8, కన్నాయిగూడెం(ములుగు)-43.2, ములుగు 42.5గా నమోదయ్యాయి. మీ ప్రాంతంలో ఎండ తీవ్రత ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News February 7, 2026
బంధం విఫలం అవ్వడం మీ తప్పు కాదు

ప్రేమలో విఫలం అయిన తర్వాత చాలామంది తమ తప్పుల వల్లే అలా అయిందని బాధపడుతుంటారు. ఇలాంటి ప్రతికూల ఆలోచనలు డిప్రెషన్‌కు కారణమవుతాయంటున్నారు నిపుణులు. వాళ్ల ఆలోచనలు, గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడం సరికాదు. సానుకూల దృక్పథం, స్వీయ ప్రేమను అలవర్చుకొని జీవితంలో ముందుకు సాగాలి. ఎంత ప్రయత్నించినా బాధ నుంచి బయటపడలేకపోతుంటే మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది.
News February 7, 2026
MHBD: నలుగురు అభ్యర్థుల ఇంటి పేరు ఒకటే!

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ 3వ వార్డులో ఎన్నికల పోరు విభిన్నంగా మారింది. ఎస్సీ రిజర్వుడ్ అయిన ఈ వార్డులో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతో పాటు జనసేన నుంచి బరిలో ఉన్న నలుగురు అభ్యర్థుల ఇంటి పేరు ‘తూర్పాటి’ కావడం విశేషం. ఒకే సామాజిక వర్గం, ఒకే ఇంటి పేరు గల అభ్యర్థులు తలపడుతుండటంతో ఓటర్లలో అయోమయం నెలకొంది. ఈ ‘తూర్పాటి’ల సమరంలో విజేత ఎవరోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
News February 7, 2026
రూ.20 లంచం.. 30ఏళ్ల పోరాటంలో విజయం.. అంతలోనే విషాదం

₹20 లంచం ఆరోపణలపై 30ఏళ్లు పోరాడి గెలిచిన రిటైర్డ్ కానిస్టేబుల్ ఆ మరుసటి రోజే తనువు చాలించారు. గుజరాత్ అహ్మదాబాద్ వేజల్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా చేసిన బాబుభాయ్ ప్రజాపతిపై 1996లో లంచం కేసు నమోదైంది. విచారణలో దోషిగా తేల్చిన సెషన్స్ కోర్టు 2004లో 4ఏళ్ల జైలు శిక్ష, ₹3K ఫైన్ వేసింది. ఆ తీర్పును హైకోర్టులో సవాలు చేయగా సాక్షుల వాంగ్మూలంలో పొంతన లేకపోవడంతో తాజాగా నిర్దోషిగా తేల్చింది.


