News May 7, 2025
వరంగల్ జిల్లాలో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. ఖిలా వరంగల్-42.6, ములుగు రోడ్డు-42.9, సీరోలు(MHBD)-42.4, జఫర్‌గడ్(జనగామ)-42.8, కన్నాయిగూడెం(ములుగు)-43.2, ములుగు 42.5గా నమోదయ్యాయి. మీ ప్రాంతంలో ఎండ తీవ్రత ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News February 12, 2026
సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాష్ బాధ్యతల స్వీకరణ

సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్), చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బి.వెంకన్న ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. సీఎండీ మాట్లాడుతూ.. సంస్థ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని స్పష్టం చేశారు.
News February 12, 2026
నల్గొండ: మున్సిపల్ పోరులో ‘సింహం’ గర్జిస్తుందా?

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో AIFB అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన పార్టీల టికెట్లు దక్కని పలువురు నేతలు ‘సింహం’ గుర్తుపై పోటీకి దిగారు. మొత్తం 48 డివిజన్లలో ఫార్వర్డ్ బ్లాక్ తరఫున 11 మంది బరిలో నిలవగా, ఐదుగురు అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తామని ధీమాగా ఉన్నారు. రేపు వెలువడనున్న ఫలితాల్లో సింహం గుర్తు ఏ మేరకు ప్రభావం చూపుతుందోనని నగరంలో ఆసక్తికర చర్చ సాగుతోంది.
News February 12, 2026
చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే..

చలికాలంలో చర్మం నిస్తేజంగా, పొడిగా మారుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజర్ రాయడంతో పాటు స్నానానికి గోరువెచ్చని నీరే వాడాలని చెబుతున్నారు. నిద్రపోయే ముందు నూనె, లోతైన మాయిశ్చరైజర్లతో స్కిన్ కేర్ చేసుకోవాలి. దీనివల్ల మృదువైన చర్మాన్ని పొందొచ్చు. తగినంత నీరు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.


