News February 18, 2025

వరంగల్: టూరిస్టుల కోసం స్పెషల్ బస్సు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు పర్యాటక ప్రదేశాల సందర్శన కోసం టూరిజం సంస్థ ప్రత్యేక ఏసీ బస్సును ఏర్పాటు చేసింది. ఈనెల 20న ఉదయం 7.45కు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ నుంచి బస్సు ప్రారంభమవుతుంది. వేయి స్తంభాల గుడి, భద్రకాళి దేవాలయం, రామప్ప, లక్నవరం, రాత్రి ఖిలా వరంగల్ సందర్శన అనంతరం రాత్రి 8 గంటలకు హన్మకొండకు చేరుకుంటుంది. పెద్దలకు రూ.980లు, పిల్లలకు రూ.790లుగా టికెట్ ధర నిర్ణయించారు.

Similar News

News April 19, 2026

ఓడినా పెరిగిన CSK ర్యాంక్.. అదెలా?

image

IPL: SRHతో మ్యాచ్‌లో ఓడినా పాయింట్ల పట్టికలో CSK ఒక మెట్టు పైకి ఎక్కడం విశేషం. మ్యాచ్‌కు ముందు -0.846 రన్ రేట్‌తో ఎనిమిదో ప్లేస్‌లో ఉన్న చెన్నై కేవలం 10 పరుగుల తేడాతోనే ఓడిపోవడంతో రన్ రేట్ -0.780కి మెరుగైంది. దీంతో లక్నోను వెనక్కి నెట్టి ఏడో స్థానానికి చేరింది. ఈ మ్యాచ్‌లో ఎషాన్ మలింగ యార్కర్లతో కట్టడి చేయగా చివరి ఓవర్‌లో ప్రఫుల్ హింగే అద్భుతంగా బౌలింగ్ చేసి హైదరాబాద్‌కు విజయాన్ని అందించాడు.

News April 19, 2026

నిరుపయోగంగా గజ్వేల్ ఆర్టీసీ బస్టాండ్..!

image

గజ్వేల్ పట్టణంలోని తూప్రాన్ రోడ్డులో రూ.6 కోట్ల వ్యయంతో ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన బస్టాండ్ నిరుపయోగంగా మారింది. గత ప్రభుత్వ హాయాంలో నిర్మించిన ఈ బస్టాండ్ గజ్వేల్ పట్టణానికి దాదాపుగా కిలోమీటరున్నర దూరంలో ఉండడంతో ప్రయాణికులు, ఆర్టీసీ బస్సులు అక్కడికి వెళ్లడం లేదు. దీంతో కోట్లాది రూపాయల ప్రజా సొమ్ము దుర్వినియోగం అవుతోంది. సదరు బస్టాండ్‌ను ఇతర అవసరాలకు వినియోగించాలని ప్రజలు కోరుతున్నారు.

News April 19, 2026

చిరు, బాలయ్యతో మోహన్‌లాల్ క్రేజీ రోల్స్?

image

చిరంజీవి, బాబీ కాంబో మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటిస్తున్నారనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. తాజాగా బాలయ్య-వివేక్ ఆత్రేయ ప్రాజెక్టులోనూ ఆయన పేరు వినిపిస్తోంది. ఒకేసారి ఇద్దరు బిగ్ స్టార్స్ సినిమాల్లో కనిపిస్తే ఫ్యాన్స్‌కు పండగే. అయితే డేట్స్ ఇష్యూ వల్ల చిరు సినిమా నుంచి ఆయన తప్పుకొనే ఛాన్స్ ఉందని టాక్. ఒకవేళ అంతా సెట్ అయితే 2027 సంక్రాంతికి మోహన్‌లాల్ డబుల్ ధమాకా ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.