News August 11, 2025

వరంగల్: ట్రాన్స్‌జెండర్లకు ఉచిత ఉన్నత విద్య

image

డా.బీ.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) సమాన అవకాశాల ప్రణాళికలో భాగంగా తెలంగాణలోని ట్రాన్స్‌జెండర్లందరికీ ఉచిత డిగ్రీ ప్రోగ్రాం అందిస్తోంది. వారికి నామమాత్రపు ₹500 రిజిస్ట్రేషన్ రుసుం మాత్రమే చెల్లించి, మిగతా ట్యూషన్ ఫీజులను మినహాయించాలని నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలో 10+2 పాసైన ట్రాన్స్‌జెండర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్లు కోరారు.

Similar News

News March 7, 2026

నల్గొండ: థియేటర్లో పార్కింగ్ ఫీజు ఇవ్వకండి..!

image

థియేటర్ల పార్కింగ్ దందాపై హైకోర్టు కొరడా ఝుళిపించింది. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ రుసుము వసూలు చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన 121వ జీవోను సస్పెండ్ చేస్తూ ప్రేక్షకులకు భారీ ఊరటనిచ్చింది. వ్యాపార ప్రయోజనాల కంటే వినియోగదారుల హక్కులే ముఖ్యమని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఉమ్మడి NLGలో సుమారు 30 వరకు సింగిల్ స్ర్కీన్స్ థియేటర్లు ఉన్నాయి.

News March 7, 2026

ఎన్టీఆర్: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షలు ఎప్పుడంటే

image

కృష్ణా యూనివర్శిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో బీ ఫార్మసీ చదివే విద్యార్థులు రాయాల్సిన 3, 4, 5, 7వ సెమిస్టర్ (వన్ టైం ఆపర్చునిటీ) పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ నెల 24 నుంచి 31 మధ్య నిర్ణీత తేదీలలో వర్శిటీ పరిధిలోని 2 కళాశాలలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU అధ్యాపకులు తెలిపారు. సబ్జెక్టువారీగా టైం టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరారు.

News March 7, 2026

నల్గొండకు నేడు ముగ్గురు మంత్రుల రాక

image

నల్గొండ కలెక్టరేట్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌, అడ్లూరి లక్ష్మణ్‌తో పాటు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. అభివృద్ధి పనులపై సమీక్షించనున్న ఈ భేటీ కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.